Home  »  News  »  హోంబలే బ్యానర్‌లో సూర్య పాన్ ఇండియా మూవీ.. 'జై భీమ్' డైరెక్టర్‌తో నయా సంచలనం!

Updated : Jun 29, 2026

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) మరో సంచలన ప్రకటన చేసింది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ సంస్థ, తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya)తో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 'జై భీమ్' చిత్ర దర్శకుడు టి. జె. జ్ఞానవేల్ తెరకెక్కించనున్నారు. జూన్ 29, 2026 న చెన్నైలోని ప్రతిష్టాత్మక పార్క్ హయత్ హోటల్‌లో ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ ముహూర్తపు వేడుకను ఇండస్ట్రీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. నిర్మాత విజయ్ కిరగందూర్ నేతృత్వంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం బలమైన కథాంశంతో పాటు, విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

గత రెండు దశాబ్దాలుగా వర్సటైల్ యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సూర్య ఖాతాలో ఇప్పటికే 2 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 7 ఫిలింఫేర్ సౌత్ అవార్డులు ఉన్నాయి. కమర్షియల్ సినిమాలతో పాటు సామాజిక బాధ్యత గల పాత్రలను ఎంచుకుంటూ ఆయన సాధిస్తున్న విజయం అద్భుతం. ఇక ఐఎండిబి (IMDb) ఇండియాలో అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచిన 'జై భీమ్' దర్శకుడు జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆలోచింపజేసే కథలకు, భావోద్వేగాలను జోడించి వెండితెరపై అద్భుతాలు సృష్టించడంలో జ్ఞానవేల్ శైలి ప్రత్యేకం.

ఈ క్రేజీ ప్రాజెక్టులో సూర్య సరసన యంగ్ బ్యూటీ కాయాదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, ఎస్. ఆర్. కతిర్ సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అలాగే కె. కతిర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. 

బలమైన కథ, ప్రతిభావంతులైన నటీనటులు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల కలయికలో వస్తున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

https://x.com/hombalefilms/status/2071516269518504236






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.