Home  »  News  »  Vishwanath and Sons: సూర్య, మమితా బైజు నేనో బటర్ ఫ్లై ప్రోమో చూశారా!

Updated : Jun 17, 2026

 

కరుప్పు ఇచ్చిన జోష్ తో ఉన్న సూర్య, మమితా బైజు జంటగా చేస్తున్న  లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' . హిట్ చిత్రాల మేకర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై  భారీ అంచనాలు ఉన్నాయి. . ఈ సినిమాలోని మొదటి సింగిల్ 'నేనో బటర్ ఫ్లై' (Neno Butterfly) సాంగ్ ప్రోమోని మేకర్స్  విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే సూర్య, మమితా బైజుల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని అర్థమవుతోంది.

ఈ చిత్రంలో సూర్య 40 ఏళ్ల ఒక మాజీ ఇంటర్నేషనల్ షూటింగ్ ఛాంపియన్‌ సంజయ్ విశ్వనాథ్ గా కనిపిస్తున్నారు. వయసు పైబడటం, చూపు మందగించడం వంటి సమస్యలతో కెరీర్‌లో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆయన జీవితంలోకి ఒక అందమైన ప్రేమకథ ప్రవేశిస్తుంది.  విశ్వనాథ్ కంటే దాదాపు 20 ఏళ్లు చిన్నదైన మ్యాడీ (మమితా బైజు) అనే చలాకీ అమ్మాయి ఆయనతో ప్రేమలో పడుతుంది. ఈ ఒక వైపు ప్రేమ, వారి మధ్య ఉన్న వయోభేదం (Age Gap) చుట్టూ తిరిగే ఎమోషనల్ అండ్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా విడుదలైన 'నేనో బటర్ ఫ్లై' సాంగ్ ప్రోమోలో మమితా బైజు తన కంటే పెద్దవాడైన సూర్య క్యారెక్టర్‌ను అమితంగా ఇష్టపడుతూ, అతనిపై పెంచుకున్న క్రష్‌ను వ్యక్తపరిచే విధానం చాలా క్యూట్‌గా ఉంది. ఒక రఫ్ గైకి, టఫ్ గర్ల్‌కి మధ్య జరిగే అందమైన ప్రేమకథగా ఈ పాటను చూపించబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) ఈ చిత్రానికి అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ పెప్పీ అండ్ మెలోడియస్ ట్రాక్‌ను 'కూలీ' ఫేమ్ సుభాషిణి తనదైన శైలిలో ఆలపించగా, స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన తెలుగు లిరిక్స్ అందించారు.

Also read: మొగుడిని ఆడింగోడు అని అవమానించిన పెళ్ళాం


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జూన్ 19న ఈ పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ సరికొత్త కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.ముఖ్యంగా ఈ 2026 ఆగస్ట్ 14న విడుదల కాబోతున్న ఈ చిత్రం నుండి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.