Home

»

Latest News

మొగుడిని ఆడింగోడు అని అవమానించిన పెళ్ళాం

Jun 17, 2026 7:02PM

 

 

తెలుగు చిత్రసీమలో తనదైన నటనతో, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రియల్ స్టార్ శ్రీహరి. ఆయన అకాల మరణం టాలీవుడ్‌కు తీరని లోటైనప్పటికీ, ఆయన నటించిన ఎన్నో అద్భుతమైన క్యారక్టర్  , సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీహరి కెరీర్‌లో మాస్ యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన కాలంలో వచ్చిన ‘ఎవడ్రా రౌడీ’ చిత్రం ఆయన అభిమానులకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం. 2001 ఆగస్టు 10న విడుదలైన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి శరత్ దర్శకత్వం వహించగా, పోసాని కృష్ణమురళి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఎమోషనల్ మరియు అల్టిమేట్ సీన్ యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ పవర్‌ఫుల్ సన్నివేశం సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ, పాత రోజులను గుర్తుచేస్తోంది.


ఈ చిత్రంలో శ్రీహరి (ధన్వి) ఒక సాధారణ, శాంతస్వభావం గల ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తారు. చుట్టుపక్కల ఎంత అన్యాయం జరుగుతున్నా, సమాజంలో మాఫియా డోన్ మోహన్ రాజ్ అరాచకాలు సృష్టిస్తున్నా.. తన కుటుంబం, తన భార్య (సంఘవి) బాగుంటే చాలని భావించే ఒక మధ్యతరగతి వ్యక్తి.. ఎంతలా అంటే కొత్తగా పెళ్ళైన తన భార్య సత్య(సంఘవి) తో సినిమాకి వెళ్తాడు. థియేటర్ లో ఒక వ్యక్తి భార్య నడుము పట్టుకున్నా కూడా వాళ్ళ పాపం వాళ్ళు అనుభవిస్తారని అంటాడు. రౌడీలు భూకంపం పేరుతో భార్యని 2000 రూపాయలు చందా అడుగుతారు. కానీ సత్య ఇవ్వదు. దీంతో సత్యని రౌడీ చెంపకేసి కొడతాడు. ఆ తర్వాత ధన్వి వచ్చి రౌడీకి సారీ చెప్పి డబ్బులు ఇస్తాడు.  దీంతో సత్య షాక్ అవుతుంది. ఒకానొక సందర్భంలో తన కళ్ళ ముందే పొరుగువాడైన ముద్దుకృష్ణ (పోసాని కృష్ణమురళి) కుటుంబం అద్దెకుండే రౌడీల చేతిలో ఘోరమైన వేధింపులకు గురవుతున్నప్పుడు కూడా ధన్వి మౌనంగా ఉంటాడు. సమాజం పట్ల ఆయన చూపే ఈ ఉదాసీనత, చేతకానితనం సత్యకి తీవ్ర కోపం తెప్పిస్తుంది. దీంతో ఆడంగిలోడుతో కాపురం చెయ్యలనేనని తాళి తెంచి వెళ్ళిపోతుంది.అసలు అంతటి కండబలం, ధైర్యం ఉన్న ధన్వి సమాజంలో జరిగే అరాచకాలను చూస్తూ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? అనే పాయింట్ చుట్టూ సాగే ఈ ఎమోషనల్ సీన్ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది.ఈ సన్నివేశంలో శ్రీహరి పలికించిన హావభావాలు, డైలాగ్స్ ఒక సాధారణ పౌరుడి అంతర్మథనాన్ని, వ్యవస్థపై ఉన్న నిరాశను కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. ఒక రూపాయి విలువ గురించి, సమాజంలో బ్రతకడానికి ఒక సామాన్యుడు పడే కష్టాల గురించి శ్రీహరి చెప్పే డైలాగ్స్ థియేటర్లలో అప్పట్లో భారీ చప్పట్లు కొట్టించాయి.

 కేవలం ఫైట్లు, రౌడీయిజం మాత్రమే కాకుండా, గుండెకు హత్తుకునే సెంటిమెంట్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉండటంతో ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు. సంగీత దర్శకుడు కోటి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సీన్‌ను మరింత ఎమోషనల్‌గా ఎలివేట్ చేసింది. చలపతి రావు, సుజాత, ఎం.ఎస్. నారాయణ వంటి సీనియర్ నటుల నటన ఈ చిత్రానికి అదనపు బలాన్ని చేకూర్చింది.ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో ఈ పాత అల్టిమేట్ సీన్ వైరల్ అవ్వడంతో, రియల్ స్టార్ శ్రీహరి నటనను నెటిజన్లు కొనియాడుతున్నారు. "శ్రీహరి గారు కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఇలాంటి ఎమోషనల్ సీన్స్ కూడా అద్భుతంగా చేయగలరని ఈ సీన్ నిరూపిస్తుంది" అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికీ టీవీల్లో లేదా యూట్యూబ్‌లో ఈ చిత్రం వస్తే ఛానల్ మార్చకుండా చూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, అన్యాయాన్ని ఎదిరించాలని చెప్పే ఇలాంటి కమర్షియల్ సందేశాత్మక చిత్రాలు టాలీవుడ్‌లో ఎప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com