![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా చేస్తున్నారు. 'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య-మలినేని కాంబో కావడంతో ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలు ఉన్నాయి.
'NBK111' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. కాజల్ అగర్వాల్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల షూటింగ్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. సెట్స్‌లో సినిమా తెరకెక్కుతున్న తీరు, దర్శకుడి పనితనం చూసి ఆమె ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి కాజల్ అగర్వాల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "NBK 111 ఒక న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా. ఇందులో నందమూరి అభిమానులు ఆశించే మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని కథను చెప్పే విధానం చాలా కొత్తగా, అద్భుతంగా ఉంది. మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించడంతో పాటు నేటి తరం ట్రెండ్‌కు తగ్గట్టుగా సరికొత్త స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు" అని కాజల్ చెప్పుకొచ్చారు.
గతంలో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి ఈ హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతుండటంతో, ఈ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
కాగా, రేపు (జూన్ 10) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ టీజర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పి ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంచనాలు పెంచేశారు.
![]() |
![]() |