Home  »  News  »  Thaman: ఇదే నా చివరి సినిమా.. తమన్ సంచలన ప్రకటన

Updated : Jun 8, 2026

 


టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman)ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలలో అత్యంత బిజీయెస్ట్ టెక్నీషియన్‌గా దూసుకుపోతున్నాడు. వరుస క్రేజీ ప్రాజెక్టులతో, స్టార్ హీరోల చిత్రాలకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చార్ట్‌బస్టర్ సాంగ్స్ అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, సంగీత ప్రపంచంలో మునిగితేలే తమన్, ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక క్రేజీ తమిళ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సంగీత దర్శకుడిగా వందకి పైగా సినిమాలకి  అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన తమన్, ఇప్పుడు వెండితెరపై నటుడిగా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన యాక్టింగ్ కెరీర్‌పై చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా  ట్రెండ్ అవుతున్నాయి.

నటన వైపు అడుగులు వేయడంపై తమన్ స్పందిస్తూ, ఈ సినిమా కథ విన్నప్పుడు తనకు బాగా నచ్చిందని, అందుకే కెమెరా ముందుకు రావడానికి ఒప్పుకున్నానని తెలిపారు. అయితే, భవిష్యత్తులో నటుడిగా కొనసాగే ఉద్దేశం  అసలు లేదు. భవిష్యత్తులో మరే ఇతర సినిమాలోను నటించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న ఈ క్రేజీ తమిళ చిత్రమే నా కెరీర్‌లో మొదటి మరియు చివరి సినిమా.. ఈ ఒక్క సినిమాతోనే నటనకి  పూర్తిగా గుడ్‌బై చెప్పేస్తానని ఆయన తేల్చి చెప్పారు. 


Also read: R madhavan: మాధవన్ తన భార్యని మోసం చేశాడా!

తమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ తమిళ చిత్రం అన్ని రకాల నిర్మాణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్  వేగవంతం కానున్నాయి.  2003 లో శంకర్ దర్శకత్వంలో సిద్దార్ధ్ హీరోగా  వచ్చిన బాయ్స్  మూవీలో సిద్దార్ధ్ ఫ్రెండ్ గా కనిపించిన విషయం తెలిసిందే. 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.