![]() |
![]() |

భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. వందల కోట్లు కాదు, ఏకంగా వేల కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పౌరాణిక చిత్రం 'రామాయణ', మహేష్ బాబు, రాజమౌళిల కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'వారణాసి' చిత్రాల బడ్జెట్లపై సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఒకటే చర్చ సాగుతోంది. నివేదికల ప్రకారం రెండు భాగాలుగా రాబోతున్న 'రామాయణ' సిరీస్ బడ్జెట్ అక్షరాలా 4000 కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా. అలాగే 'వారణాసి' చిత్రం కూడా దాదాపు 1400 కోట్ల రూపాయల భారీ వ్యయంతో తెరకెక్కుతుంది.
రీసెంట్ గా బాలీవుడ్ అగ్ర నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో రామాయణ', వారణాసి చిత్రాల వేల కోట్ల బడ్జెట్ ప్రచారం గురించి యాంకర్ ప్రశ్న వేసింది. అప్పుడు మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతు 'ఇదంతా కేవలం ఒక పీఆర్ ట్యాక్టిక్ (పబ్లిసిటీ స్ట్రాటజీ) మాత్రమే. గత 15 ఏళ్లుగా సినిమా ప్రమోషన్ల కోసం ఈ విధమైన ట్రెండ్‌ని వాడుతున్నారు. కేవలం బడ్జెట్ నంబర్లను చూసి సినిమాలు హిట్ అవుతాయనే భ్రమ కల్పించడం సరికాదు. ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు, వందల కోట్ల బడ్జెట్ సంభాషణలు సాధారణ ప్రేక్షకుల బుర్రల్లోకి ఎంతగా ఎక్కాయంటే, అది ఇప్పుడు ఒక అంటువ్యాధిలా మారింది. నేను ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు కలిసే కొందరు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా కథ గురించి కాకుండా, ఏ సినిమా ఎన్ని వందల కోట్లు వసూలు చేసిందనే నంబర్ల గురించే మాట్లాడుతుంటారు. అలాంటి సమయంలో నాకు చాలా కోపం వస్తుంది. అటువంటి ప్రేక్షకులని పలుమార్లు గట్టిగానే మందలించాను.
Also read: చిన్న హీరో, పెద్ద సాయం..118 మంది విద్యార్థులకి ఏం సాయం చేసాడో తెలుసా!
ఆ సినిమాలకు వచ్చే 500 కోట్ల రూపాయలు, 600 కోట్ల రూపాయల లాభాల్లోంచి ఒక్క రూపాయి అయినా మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుందా? అని నేను వారిని నేరుగా అడుగుతాను. మీ అకౌంట్లోకి ఆ డబ్బులు వస్తే మీరు ఆ బాక్స్ ఆఫీస్ నంబర్ల గురించి మాట్లాడండి. లేదంటే సినిమా మీకు నచ్చిందా లేదా!. కంటెంట్‌ని వదిలేసి, కేవలం నంబర్ల మాయాజాలంలో పడద్దంటూ వాళ్ళకి చెప్పానని మాట్లాడటం జరిగింది. ప్రస్తుత్తం ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
![]() |
![]() |