Home  »  News  »  Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ క్రేజ్.. ప్రీమియర్ షోకు క్యూ కడుతున్న సినీ ప్రముఖులు!

Updated : Jun 3, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న గ్రాండ్‌గా విడుదలవుతోంది. అయితే, ఈ మూవీ అఫీషియల్ రిలీజ్‌కు ఒక రోజు ముందే అంటే.. ఈరోజు (జూన్ 3) రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో రాత్రి 8 గంటల ప్రీమియర్ షోకు భారీ హైప్ నెలకొంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి సినిమాను వీక్షించనుండటం విశేషం. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రానికి సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా వ్యవహరించడంతో టాలీవుడ్ వర్గాల్లో ఈ షోపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో క్రికెట్, కుస్తీ వంటి క్రీడల నేపథ్యంలో అణగారిన వర్గాల కోసం పోరాడే వీరుడిగా రామ్ చరణ్ పాత్ర అద్భుతంగా డిజైన్ చేయబడిందని టాక్. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే ఈ చిత్రం 1.50 మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ల కోసమే 30 వేలకు పైగా టికెట్లు అమ్ముడవడం చరణ్ బాక్సాఫీస్ స్టామినాను నిరూపిస్తోంది. ఇండియాలోనూ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే ప్రీ సేల్స్ ద్వారానే ఈ సినిమా దాదాపు రూ.40 కోట్లు రాబట్టడం విశేషం.

సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి భారీ తారాగణం ముఖ్య పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. 

దర్శకుడు బుచ్చిబాబు లీక్ చేసిన సమాచారం ప్రకారం, సినిమా చివరి 50 నిమిషాల ఎమోషనల్ అండ్ షాకింగ్ క్లైమాక్స్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించడమే కాకుండా థియేటర్ల నుండి భారమైన హృదయంతో బయటకు వచ్చేలా చేస్తుందని, ఇది ఒక మరువలేని అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రాత్రి విమల్ థియేటర్‌లో పడబోయే షోతో 'పెద్ది' టాక్ ఏంటనేది అధికారికంగా తేలిపోనుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.