Home  »  News  »  Shiva rajkumar: గౌరనాయుడు అసలు క్యారక్టర్ ఈ హీరోదే.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం

Updated : Jun 3, 2026

 


కన్నడ స్టార్ హీరో కరుణాడ చక్రవర్తి శివరాజ్‌కుమార్(Shiva Rajkumar)అలియాస్ శివన్న 'పెద్ది'(Peddi)తో తెలుగు నాట అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. 'గౌరనాయుడు' అనే పవర్ ఫుల్ ప్రతినాయకుడు రోల్ లో కనిపించనున్నాడు. గౌరనాయుడు లుక్ ,ప్రచార చిత్రాలు చూస్తుంటే తన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడనే విషయం అర్ధమవుతుంది. జైలర్ , గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీస్ లో కేవలం కొద్ది నిమిషాల క్యామియో రోల్‌తోనే తెలుగు నాట పూనకాలు తెప్పించిన శివన్నకి 'పెద్ది' పూర్తి నిడివి గల రోల్. దీంతో శివన్నకి  టాలీవుడ్‌లో ఒక కెరీర్ డిఫైనింగ్ అండ్ మైండ్‌బ్లోయింగ్ బ్రేక్ ఇస్తుందా అనే చర్చ  ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

పెద్దిలో శివరాజ్‌కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ శివన్న ఎలివేషన్ సీన్లని  నెక్స్ట్ లెవెల్‌కి  తీసుకెళ్లిందని, గౌరనాయుడుగా శివన్న జీవించారని చిత్ర యూనిట్ చెబుతోంది. స్వయంగా రామ్ చరణ్  మాట్లాడుతు శివన్న స్క్రీన్‌పై కనిపిస్తే అదొక ప్రభంజనం. కేవలం జైలర్ లో ఆయన సిగరెట్ కాల్చే స్లో మోషన్ షాట్ కోసమే నేను జైలర్ ని ఎన్నోసార్లు చూశానని కొనియాడారు.దీంతో 'పెద్ది' సినిమా శివరాజ్‌కుమార్‌కి తెలుగులో ఒక భారీ సోలో మార్కెట్‌ని  క్రియేట్ చేయడమే కాకుండా మరిన్ని ఆఫర్స్ రావచ్చని అభిమానులు, సినీ పరిశీలకులు బావిస్తున్నారు. 


Also read: Peddi: పెద్ది కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ వీడియో.. వైరల్ గా మారిన స్పీచ్ 

గౌరనాయుడు క్యారక్టర్ కోసం  శివరాజ్‌కుమార్ చూపించిన అంకితభావం ఎవరినైనా కన్నీళ్లు పెట్టించక మానవు. 2024 లో ఈ ప్రాజెక్ట్ కమిట్ అయిన తర్వాత, శివన్న ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడ్డారు. దాంతో ఆయన యూఎస్ వెళ్లాల్సి వచ్చింది. చిత్రం నుండి తప్పుకోవాలని ఆయన భావించినప్పటికీ, దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్ మాత్రం గౌర నాయుడు క్యారక్టర్ ని  మీరు మాత్రమే చేయాలి. మీ కోసం మేము వేచి చూస్తాం" అని నమ్మకంగా చెప్పారు. చెప్పినట్లుగానే శివన్న చికిత్స ముగించుకుని తిరిగి వచ్చే వరకు ఓపిగ్గా ఎదురుచూశారు. ఆర్టిఫిషియల్ బ్లాడర్ సర్జరీ మరియు కఠినమైన కెమోథెరపీ సెషన్ల వల్ల తీవ్రమైన అలసట ఉన్నప్పటికీ, శివన్న కన్నడ చిత్రం '45' క్లైమాక్స్‌తో పాటు 'పెద్ది' షూటింగ్‌ను అద్భుతంగా పూర్తి చేసి సినిమాపై తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.