Home  »  News  »  Premalu: ప్రేమలు హీరో నస్లీన్ షాకింగ్ కామెంట్స్.. ఎందుకు ఈ పక్షపాతం 

Updated : May 30, 2026

 

చిన్న చిత్రాలుగా వచ్చి అద్భుతాల్ని, రికార్డు కలెక్షన్స్ ని, ట్రెండ్ సెట్ ని సృష్టించే చిత్రాలు ప్రతి ఐదు సంవత్సరాలకి అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన చిత్రం ప్రేమలు. మలయాళంలో తెరకెక్కి తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. నస్లెన్(Naslen)మమిత బైజు(Mamitha Baiju), సంగీత్ ప్రతాప్ కీ రోల్స్ పోషించిన ప్రేమలకి లభించిన భారీ రెస్పాన్స్ చూసి, మేకర్స్ వెంటనే  సీక్వెల్ గా 'ప్రేమలు-2' ని  అధికారికంగా ప్రకటించారు. దీంతో  ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రేక్షకులు, ముఖ్యంగా యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి షూటింగ్ అప్‌డేట్స్ బయటకు రాలేదు. ఈ క్రమంలోనే 'ప్రేమలు-2' సీక్వెల్ ఆగిపోయినట్లుగా చాలా రోజుల నుంచి నెట్టింట న్యూస్ ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఆ వార్తలకి బలం చేకూరుస్తూ నస్లెన్ రీసెంట్ గా  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు  మొదటి భాగం వంద కోట్ల క్లబ్‌లో చేరి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, సీక్వెల్ పై ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 

also read: గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకి రారు.. ఆ హీరో గురించేనా!

ఆ అంచనాలకు తగ్గట్టుగా కథను సిద్ధం చేయడం దర్శకుడికి పెద్ద సవాలుగా మారింది. ఈ క్రమంలోనే స్క్రిప్ట్ లో పలు తీవ్రమైన సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఆశించిన స్థాయిలో కథ కుదరకపోవడం, స్క్రిప్టింగ్ లో కొన్ని లోపాలు ఉండటం వల్లే పూర్తిగా పక్కన పెట్టాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. కథ పర్‌ఫెక్ట్‌గా రాకుండా కేవలం మొదటి భాగం క్రేజ్‌ని  వాడుకోవాలని తాము అనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రేమలు మూవీ ప్రేమికులు, సినీ ప్రియులు ప్రేమలు సీక్వెల్ ఉంటుందని ఎన్నో కలలు కన్నాం. మేకర్స్ మాపై పక్షపాతం చూపించారని సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.