Home  »  News  »  Ntr: కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు..వైరల్ అవుతున్న పూర్తి మ్యాటర్ 

Updated : May 30, 2026

 


విశ్వంలో తెలుగు జాతి నమూనా అనేది ఉన్నంత కాలం ప్రతి తెలుగు వారి నోటి వెంట నిత్యం నానుతుండే పేరు ఎన్టీఆర్(Ntr). పంచభూతాలు ఎన్టీఆర్ అనే వర్డ్ కి దాసోహమన్నట్టుగా సినీ, రాజకీయాల్లో నడిచిన ఆయన అజమాయిషీ నడుస్తున్న కలియుగానికి  ప్రత్యేకమైన గుర్తింపుని సైతం తీసుకొచ్చింది. మొన్న మే 28 న ఆ మహానుభావుడి  103వ జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగాయి. 

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, సరిహద్దులు దాటి అమెరికాలోని కాలిఫోర్నియా (California) నగరంలో ప్రవాసాంధ్రులు నిర్వహించిన ఈ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాలిఫోర్నియాలోని 'బే' ఏరియాతో పాటు ప్రముఖ నగరాల్లో నివసిస్తున్న వందలాది తెలుగు కుటుంబాలు, నందమూరి అభిమానులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, 'జోహార్ ఎన్టీఆర్' అంటూ ప్రవాస తెలుగు వారు చేసిన నినాదాలతో కాలిఫోర్నియా వీధులు మారుమోగిపోయాయి.

ఈ 103వ జయంతి వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ గారు తెలుగు సమాజానికి, ముఖ్యంగా రాజకీయ రంగానికి మరియు సినిమా పరిశ్రమకి చేసిన అసమానమైన సేవలని వక్తలు గుర్తుచేసుకున్నారు. కేవలం 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, 2 రూపాయలకే కేజీ బియ్యం వంటి చారిత్రాత్మక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి పేదల గుండెల్లో 'అన్న'గా నిలిచిన తీరుని  ప్రవాసాంధ్రులు కొనియాడారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్టీఆర్ సినీ వైభవాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించాయి. దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించి, పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రల్లో మెప్పించిన ఆయన సూపర్ హిట్ పాటలకు స్థానిక తెలుగు యువత  పిల్లలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

కాలిఫోర్నియా ఈవెంట్‌లో అన్నగారి స్మారకార్థం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. అమెరికాలోని ప్రతినిధులు స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారంతో 1000 మందికి పైగా నిరుపేదలకు ఆహార వితరణ (Food Donation) కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో కూడా నందమూరి కుటుంబ సభ్యులు, నారా బ్రాహ్మిణి గారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకి  పండ్లు పంపిణీ చేయగా, ఇటు కాలిఫోర్నియాలోనూ అదే సేవా స్ఫూర్తిని ప్రదర్శించడం విశేషం. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలని ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలు, రాబోయే తరాలకు ఎన్టీఆర్ గారి ఆదర్శాలని, తెలుగు భాషా ప్రాముఖ్యతని  తెలియజేసేలా ఉన్నాయని పెద్దలు అభిప్రాయపడ్డారు.

Also read: Ajith Kumar: అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. శోక సంద్రంలో అజిత్ 

ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా అమెరికాలో స్థిరపడిన దాదాపు 50 కి పైగా ఐటీ మరియు వ్యాపార రంగ ప్రముఖులు హాజరై అన్నగారితో తమకున్న అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆయన క్రమశిక్షణ, సమయపాలన నేటి యువతకి ఎంతో మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు కేవలం ఒక పుట్టినరోజు వేడుకలా కాకుండా, కాలిఫోర్నియాలోని తెలుగు వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన ఒక గొప్ప పండుగలా సాగాయి. చివరగా కేక్ కట్ చేసి, అన్నగారి అమరత్వానికి నివాళులర్పించడంతో ఈ సుదీర్ఘ వేడుక అత్యంత ఘనంగా ముగిసింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.