Home  »  News  »  Peddi: హైకోర్టుని ఆశ్రయించిన పెద్ది నిర్మాత.. ఇక సినీ ఆట మొదలైనట్లేనా!

Updated : May 28, 2026

 


జూన్ 4 కి కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా మొత్తం 'పెద్ది'(Peddi)నామజాపంతో ఊగిపోతోంది. ఓవర్ సీస్ కూడా అదే పరిస్థితి.  ఈ నేపథ్యంలో పెద్ది నిర్మాత కిలారు వెంకట సతీష్(Kilaru Venkata satish)హైకోర్టుని ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వెంకట సతీష్ మద్రాస్ హైకోర్టు(Madras Highcourt)లో ఒక పిటిషన్ దాఖలు చేసారు. సదరు పిటిషన్ లో పెద్ది  విడుదలకి  ముందే అనధికారిక లింకులు, వెబ్‌సైట్లలో సినిమా ప్రసారం కాకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు తన తీర్పులో 'పెద్ది విడుదలకి ముందే పైరసీని అరికట్టేలా ముందస్తు నిషేధాజ్ఞలను జారీ చేసింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు,వివిధ కేబుల్ టీవీ ఆపరేటర్లు, అనధికారిక కంటెంట్ ప్రసారం చేసే వెబ్‌సైట్లు ఏవీ కూడా సదరు చిత్రాన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అక్రమంగా టెలికాస్ట్ చేయకూడదు. ఒకసారి మూవీ ఇంటర్నెట్‌లో లీక్ అయితే, ఆ తర్వాత తీసుకునే చర్యల వల్ల నిర్మాతకి  జరిగే నష్టాన్ని పూడ్చలేం. అందుకే డిజిటల్ యుగంలో ఇటువంటి ముందస్తు రక్షణ చర్యలు అత్యంత అవసరమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో సదరు నిర్మాతకు 100 శాతం ఊరట లభించినట్లయింది.  

Also read: : Blast Zone Movie Review In Telugu: 'బ్లాస్ట్ జోన్' మూవీ రివ్యూ

ఈ చారిత్రాత్మక తీర్పు కేవలం ఒక్క సినిమాకే పరిమితం కాకుండా భవిష్యత్తులో రాబోయే ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలకి  ఒక పెద్ద రక్షణ కవచంలా మారబోతోంది. చట్టవిరుద్ధమైన పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ ఛానళ్లు మరియు పైరసీ లింకులని  కట్టడి చేసేందుకు ఈ తీర్పు సినిమా ఇండస్ట్రీకి ఒక ఆయుధంగా పనిచేస్తుంది. నిర్మాతలు తమ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి కఠినమైన చట్టపరమైన చర్యలు ఎంతో అవసరమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ ముందస్తు ఇంజంక్షన్ ఆర్డర్ టాలీవుడ్, కోలీవుడ్ తో  పాటు మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.