Home  »  News  »  Drishyam 3: 'దృశ్యం 3' మూవీ ఫస్ట్ రివ్యూ.. ఈ సారి లెక్క మారింది!

Updated : May 20, 2026

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న 'దృశ్యం' మూడో భాగం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'దృశ్యం 3' (Drishyam 3 ) ప్రపంచవ్యాప్తంగా మే 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మించిన ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. అమెరికాలో మే 20 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. 

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. 'మీరు అతని తెలివితేటలను చూశారు.. అతని డిఫెన్స్‌ను గమనించారు.. కానీ దాని కోసం అతను ఎంత కోల్పోయాడో ఎప్పుడూ చూడలేదు' అనే ట్యాగ్‌లైన్ ఈసారి కథలో ఉన్న ఎమోషనల్ డెప్త్‌ను స్పష్టం చేస్తోంది.

ఈ చిత్ర రన్‌టైమ్ విషయానికి వస్తే, మొత్తం 2 గంటల 38 నిమిషాల నిడివితో ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ప్యాక్ చేశారు. ఇందులో ఫస్ట్ హాఫ్ 1 గంట 9 నిమిషాలు కాగా, సెకండ్ హాఫ్ 1 గంట 29 నిమిషాల పాటు సాగనుంది. మొదటి రెండు భాగాల్లాగే అదిరిపోయే ట్విస్ట్ ఉంటాయట. అయితే ఈసారి అంతకుమించిన ఎమోషన్స్ కట్టిపడేయనున్నాయని సమాచారం. సెన్సార్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఉంది.

గత రెండు భాగాల్లో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎవరూ ఊహించని ప్లాన్లు వేసిన జార్జ్‌కుట్టి, ఈ మూడో భాగంలో సరికొత్త మానసిక సంఘర్షణను ఎదుర్కోబోతున్నాడు. తన గతం ఎక్కడ బయటపడుతుందో అనే భయం, మరోవైపు పోలీసులు కేసును మళ్లీ రీఓపెన్ చేస్తారనే ఆందోళనల మధ్య ఈసారి జార్జ్‌కుట్టి అంతర్గత పోరాటం చేయనున్నట్లు దర్శకుడు హింట్ ఇచ్చాడు. 

ఈ చిత్రంలో మోహన్‌లాల్ సరసన రాణి పాత్రలో మీనా, కూతుళ్లుగా అన్సిబా హసన్, ఎస్తర్ అనిల్ తిరిగి నటిస్తున్నారు. వీరితో పాటు సిద్ధార్థ్, ఆశా శరత్, మురళి గోపి, వీణా నందకుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ₹20 కోట్లకు పైగా గ్రాస్ వసూలైంది. మొదటి రోజే ఈ సినిమా ₹35 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.