Home  »  News  »  Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్

Updated : May 19, 2026

 

అమ్మ ప్రేమ, తెలుగు సినిమా న్యూస్ బోర్ కొట్టడం అనేది జరగని పని. ఈ నేపథ్యంలో ఈ రోజు సరికొత్త తాజా న్యూస్ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి.


1 . బావ ఫోటో పెట్టుకున్నావ్ ఏంటి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి పూనమ్ కౌర్ ప్రశ్న

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా పెంచాలంటూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై పూనమ్ కౌర్  ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. సదరు ట్వీట్ కి ఒక నెటిజన్ గట్టిగా కౌంటర్ ఇస్తూ కామెంట్ చేసాడు. ఆ కామెంట్ చేసిన పర్సన్ డిస్‌ప్లే పిక్చర్ లో పవన్ కళ్యాణ్ పిక్ ఉంది. వెంటనే పూనమ్ కౌర్ రిప్లై ఇస్తూ 'బావ ఫోటో పెట్టుకున్నావ్' అనే కామెంట్ చేసింది. పవన్ ని ఉద్దేశించి ఆమె నేరుగా 'బావ' అనే పదాన్ని వాడటంతో సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయిపోతుంది.

2 . వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మంచు వారు పోటీ

భైరవం, మిరాయ్ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన మంచు మనోజ్ రేపు మే 20న 43 వ పడిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సంధర్భంగా ఈ రోజు  తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ వేదికపైనే మంచు మనోజ్ మాట్లాడుతు  మౌనిక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి  పోటీ చేయబోతోందని చెప్పాడు.

3 జననాయగన్ తెలుగు బిజినెస్ క్రేజ్

ఇళయ దళపతి విజయ్ చివరి మూవీ 'జననాయగన్'  తెలుగు  థియేట్రికల్ బిజినెస్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతలు తెలుగు హక్కులని 35 కోట్లు చెప్తుండగా మన బయ్యర్లు మాత్రం 20 కోట్లు ఆఫర్  చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ మార్కెట్ గత కొన్ని ఏళ్లుగా సినిమా సినిమాకి పెరుగుతూ వస్తుంది. ‘లియో’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రాలు తెలుగులో మంచి వసూళ్లు సాధించడంతో నే ‘జననాయగన్ ’ కి భారీ డిమాండ్. 

4 .క్రేజీ హీరో సరసన ఆఫర్ దక్కించుకున్న జాన్వీ కపూర్

 పెద్దితో అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడానికి  జూన్ 4 న రెడీ అవుతున్న  జాన్వీ కపూర్ ఖాతాలోకి ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మొదట హీరోయిన్ గా రుక్మిణి వసంత్‌ ని ఎంపిక చేసారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో జాన్వీ కపూర్‌ని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. తమిళనాట తన హవా చాటడానికి జాన్వీ కి మంచి అవకాశమని చెప్పవచ్చు.

5 .ఇళయరాజాకి క్షమాపణలు చెప్పిన 'కరుప్పు' టీమ్

‘కరుప్పు’ అలియాస్ వీరభద్రుడులో ఇళయరాజా సంగీతంలో వచ్చిన 'అలై ఓసై’ చిత్రంలోని 'పోరాడడా’ పాట ప్లే చేసి లెజెండ్రీ కంపోజర్ మనపై లీగల్ కేస్ పెడతారంటూ ఎగతాళి చేసిన విషయం తెలిసిందే .దీంతో విమర్శలు వస్తున్న వేళ  కరుప్పు మేకర్స్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఇళయరాజాకి క్షమాపణలు చేస్తూ సదరు డైలాగ్ ని తొలగించింది.

6 . పెద్ది ట్రైలర్ రికార్డ్స్ 
నిన్న రిలీజైన పెద్ది ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో రిలీజ్ అవ్వగా మొత్తం 100 మిలియన్ల వ్యూస్ ని సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

7 . ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ అప్ డేట్ వైరల్ 

రేపు మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. బర్త్ డే ట్రీట్ గా అప్ కమింగ్ మూవీ డ్రాగన్ నుంచి ఈ రోజు నైట్ 11 .52 కి  గ్లింప్స్ రానుంది. ప్రతీ మల్టీప్లెక్స్ టీం నుంచి కూడా డ్రాగన్ తోనే పోస్ట్ లు చేస్తుండడంతో మేనియా నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. మహేష్ ఏ ఎం బి, ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ,అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ వంటి పాపులర్ మల్టీప్లెక్స్ లలో ఎన్టీఆర్ టేకోవర్ ఈ రాత్రి ఉంటుందని పోస్టులు చేస్తున్నారు.  దీంతో ఫ్యాన్స్    ఫుల్ జోష్ లో ఉన్నారు.


8 . కల్కి 2 కోసం కమల్ త్యాగం 

 టీవల సినిమా నిర్మాణంలో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని కమల్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా  'కల్కి 2' షూటింగ్ కోసం ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్‌లో లో కాకుండా సాధారణ ఎకానమీ క్లాస్ ఫ్లైట్‌లో హైదరాబాద్ వచ్చారు. పరిశ్రమ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో కమల్  తీసుకున్న ఆ  నిర్ణయంపై నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రశంసలు కురిపించింది.

9 . రియల్ హీరో అనిపించుకున్న రామ్

రామ్ పోతినేని లేడీ అభిమాని ' ఫ్రీడ్రిచ్ అటాక్సియా'  అనే తీవ్రమైన నరాల బలహీనత వ్యాధితో పోరాడుతోంది. జీవితంలో ఒక్కసారైనా రామ్ పోతినేనిని స్వయంగా కలవాలని, ఆయనతో మాట్లాడాలని ఎప్పటి నుంచో కలలు కంటూ వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని  ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

10 . ఊసరవెల్లి రీ రిలీజ్ కలెక్షన్స్ అదుర్స్ 

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వన్ మాన్ షో ఊసరవెల్లి ఎన్టీఆర్ బర్త్ డే సందర్భగా రేపు రిలీజవుతున్న విషయం తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ లో కోటి రూపాయల మార్కుని అందుకొని రికార్డు సృష్టించింది. ఈ మిడ్ నైట్ నుంచే షోస్ పడనున్నాయి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.