Home  »  News  »  Dragon Glimpse: నేడే 'డ్రాగన్' విధ్వంసం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి 'సింహాద్రి' రోజులొచ్చాయి!

Updated : May 19, 2026

సోషల్ మీడియా మొత్తం ‘డ్రాగన్’ (Dragon) పేరుతో మారుమోగిపోతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం నుండి నేడు ఫస్ట్ గ్లింప్స్ (First Glimpse) రాబోతుంది.

ఎన్టీఆర్ పుట్టినరోజును (మే 20) పురస్కరించుకుని చిత్ర మేకర్స్ ఈ రోజు (మే 19) రాత్రి సరిగ్గా 11:52 గంటలకు ఈ ప్రతిష్టాత్మక చిత్రం యొక్క ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేస్తున్నారు.

ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ చిత్రానికి “డ్రాగన్” అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది. సెన్సార్ బోర్డ్ (CBFC) వెబ్‌సైట్‌లో కూడా ఈ గ్లింప్స్ ‘గ్లింప్స్ ఆఫ్ డ్రాగన్’ పేరుతో సర్టిఫికేట్ పొందినట్లు గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి రాబోయే గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. 

సాధారణంగా ఇండస్ట్రీలో వచ్చే టీజర్లు లేదా గ్లింప్స్‌లు కేవలం ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు మాత్రమే ఉంటాయి. కానీ, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమైన ప్రశాంత్ నీల్ ఈసారి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తూ ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల సుదీర్ఘ రన్ టైమ్‌తో ఈ గ్లింప్స్‌ను కట్ చేశారు. ఈ సుదీర్ఘమైన విజువల్స్‌లో సినిమా యొక్క కథా నేపథ్యాన్ని, ఆ గంభీరమైన ప్రపంచాన్ని (World Building) ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో పరిచయం చేయబోతున్నారు.

ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని, ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని గతంలో ప్రశాంత్ నీల్ చెప్పారు. దాంతో ఎన్టీఆర్ ను ఆయన ఏ రేంజ్ లో చూపిస్తాడోనని అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పైగా నాలుగున్నర నిమిషాల గ్లింప్స్‌ అని న్యూస్ రావడంతో.. ఫ్యాన్స్ హైప్ తో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు.

'సింహాద్రి' తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గ సరైన మాస్ సినిమా పడలేదనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. ఆ లోటు ‘డ్రాగన్’తో తీరుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కన్నడ క్రేజీ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ ఒక అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. 

1969 బ్యాక్‌డ్రాప్‌లో చైనా, భూటాన్, భారతదేశ సరిహద్దుల సమీపంలోని ‘గోల్డెన్ ట్రయాంగిల్’ ప్రాంతంలో జరిగే ఒక పీరియాడిక్ యాక్షన్ సగాగా ఈ కథ నడవబోతోంది. ఈ మైండ్ బ్లోయింగ్ పాన్-ఇండియా విజువల్ వండర్ 5 భాషల్లో (తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం) భారీ ఎత్తున జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ రాత్రి 11:52 గంటలకు విడుదల కాబోతున్న గ్లింప్స్ కోసం యావత్ భారత చిత్ర పరిశ్రమ కళ్లప్పగించి చూస్తోంది.

 

https://x.com/Theteluguone/status/2056627328617488647






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.