Home  »  News  »  Rashmika Mandanna: బాంబు పేల్చిన రష్మిక.. అది విజయ్ దేవరకొండ కోసం కాదు

Updated : May 18, 2026

 

-రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి షాక్ 
-ఇన్ని రోజులుగా ఉన్న డౌట్స్ కి ఫుల్ స్టాప్ 
-సెల్ఫ్ మోటివేషన్  కోసమే అదంతా

రష్మిక(Rashmika Mandanna),విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తమ కొత్త దాంపత్య  జీవితాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కామెంట్స్ ని సైతం అందిపుచ్చుకుంటూ అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నారు. ఇక రష్మిక చేతిపై ఎప్పట్నుంచో ఇంగ్లీషులో 'ఇర్రీప్లేసబుల్'  అని రాసి ఉన్న టాటూ ఒకటి  ఉంటుంది. ఈ టాటూ కి సరైన అర్ధం తెలియకపోయినా చాలా మంది ఫ్యాన్స్ మాత్రం ఆ టాటూ విజయ్ దేవరకొండకి సంబంధించిన రహస్య టాటూ అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ టాటూ వెనక ఉన్న అసలు రహస్యాన్ని రష్మిక వెల్లడి చేసింది


ఒక ఇంటర్వ్యూ లో  రష్మిక మాట్లాడుతూ  టాటూకి విజయ్ తో లవ్ కి ఎలాంటి సంబంధం  లేదు. నిజానికి టాటూలు వేయించుకోవడంపై ఎలాంటి ఆసక్తి గానీ, ఐడియా గానీ లేదు. కానీ  కాలేజీ రోజుల్లో ఒక క్లాస్‌మేట్ నా దగ్గరకి వచ్చి 'ఆడపిల్లలు అసలు పెయిన్ భరించలేరు, వాళ్లకి సూదులు అన్నా, ఇంజెక్షన్లు అన్నా చాలా భయం, చిన్న చిన్న నొప్పులకే భయపడిపోతారు' అంటూ వెటకారంగా కామెంట్ చేశాడు.దాంతో నాకు  విపరీతమైన కోపం వచ్చింది. ఆడవాళ్లు తలుచుకుంటే ఎలాంటి బాధనైనా తట్టుకోగలరని, దేనికైనా సిద్ధమే అని ఆ అబ్బాయికి నిరూపించడం కోసం ఎలాగైనా టాటూ వేయించుకోవాలని మొండిగా ఫిక్స్ అయిపోయాను.

Also read: fahadh faasil: హీరోగా ఫాహద్ ఫాజిల్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

కానీ టాటూ స్టూడియోకి వెళ్లాక చేతిపై ఏం రాయించుకోవాలా అని ఆలోచించాను. కేవలం ఒక అబ్బాయికి సవాల్ విసరడమే కాకుండా,నా జీవితానికి సరిపడే ఒక మంచి అర్థం ఉన్న పదాన్ని ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యాను. లైఫ్‌లో చాలా రియల్‌గా,  ఒరిజినల్‌గా ఉండాలని బలంగా నమ్ముతాను. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషిని, మరొకరు భర్తీ చేయలేరని (No one can replace you) ప్రతి ఒక్కరికీ  ప్రత్యేకమైన గుర్తింపు, సొంత ఎనర్జీ ఉంటాయని నా నమ్మకం. అందుకే ఎవరికీ వారు సాటి, ప్రతి ఒక్కరూ ఈ సృష్టిలో ప్రత్యేకమైనవారే అని ప్రతిక్షణం గుర్తుచేసుకోవడానికి 'ఇర్రీప్లేసబుల్' అనే పదాన్ని టాటూగా వేయించుకున్నాను. ఈ టాటూ ఎల్లప్పుడూ ఒక గమ్యం లాగా, వ్యక్తిగత ఎదుగుదలకి  సెల్ఫ్ మోటివేషన్ లాగా ఉపయోగపడుతుందని రష్మిక వివరించింది.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.