Home  »  News  »  Anna Lezhneva: కీలక నిర్ణయం తీసుకున్న అన్నాలెజినోవా.. వెల్ కమ్ చెప్తున్నపవన్  

Updated : Mar 25, 2026

 

 

-తన పేరు మార్చుకున్న పవన్ వైఫ్ అన్నా 
-కీలక నిర్ణయం కూడా 
-ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం 

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వైఫ్ 'అన్నాలెజినోవా'(Anna lezhneva)గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాఖ్యానాలు అవసరం లేదు. అంతలా అభిమానులు, తెలుగు జనాలతో మమేకమై ఉంది. రీసెంట్ గా అన్నాలెజినోవా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పవన్ ఆమెకి వెల్ కమ్ చెప్పాడు. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.   


అన్నాలెజినోవా రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ అయ్యింది. తన పేరుని 'అన్నా కొణిదెల'గా మార్చుకుంది. ఈ సందర్భంగా పవన్ తన భార్యకి స్వాగతం పలుకుతు ఒక పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ లో డియర్ అన్నా కొణిదెల, ఇన్‌స్టాగ్రామ్‌లోకి నీకు సాదర స్వాగతం. ఈ వేదిక ద్వారా నువ్వు అర్థవంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన విషయాలని పంచుకుంటావని ఆశిస్తున్నాననే వ్యాఖ్యలు చేసాడు.

Also read: Dhurandhar 2: ధురంధర్ గా అల్లుఅర్జున్ చేసి ఉంటే.. ఇలాగే ఉండేది పరిస్థితి

ఇక అన్నా తన ఫస్ట్ పోస్ట్‌ని  చాలా స్పెషల్‌గా షేర్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేస్తు 'ఇది ఎప్పుడో జరగాల్సింది. కానీ ఇప్పుడే సరైన సమయం అనిపిస్తోంది. చిరంజీవి(Chiranjeevi)గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ఇక్కడికి వచ్చానని పేర్కొంది. ముఖ్యంగా తన బయోలో 'రష్యన్ హార్ట్, ఇండియన్ సోల్’ అని ఉంచడం నెటిజన్లని  ఆకర్షిస్తుంది. మరి పవన్ చెప్పినట్టుగా అర్థవంతమైన,స్ఫూర్తిదాయకమైన విషయాలతో అన్నా కొణిదెల పవన్, చిరంజీవిని మించిన ఫాలోవర్స్ ని దక్కించుకుంటుందేమో చూడాలి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.