![]() |
![]() |

-కొన్ని రోజుల క్రితమే ఫర్మాన్ ఖాన్ తో పెళ్లి
-లవ్ జిహాద్ ఆరోపణలు
-కన్నీటి పర్యంతమవుతున్న మోనాలిసా
మోనాలిసా(Monalisa)..కుంభామేళ తర్వాత ఎంత పాపులర్ అయ్యిందో, తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకొని అంతే పాపులర్ అయ్యింది. పెళ్లి విషయంలో ఆమె బంధువులు మాత్రం మోనాలిసా మైనర్ పెళ్లి చెల్లదని అంటుంటే, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా(Sanoj Mishra)అయితే నేరుగా లవ్ జిహాద్ ఆరోపణలు చేసాడు. దీంతో ఏ ఇద్దరు, ముగ్గురు కలిసినా మోనాలిసా గురించే చర్చ. రీసెంట్ గా మోనాలిసా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక దర్శకుడిపై పలు ఆరోపణలు చేసింది. దీంతో చర్చల స్థాయి ఆకలిని కూడా మర్చిపోయేలా ఇండియన్ సినీ, సోషల్ సర్కిల్స్ లో వైరల్ గా నిలుస్తున్నాయి. అవేంటో చూద్దాం.
రీసెంట్ గా తన భర్త ఫర్మాన్ ఖాన్ తో కలిసి మీడియా సమక్షంగా మోనాలిసా కన్నీటి పర్యంతంతో మాట్లాడుతు 'నాకు తెలిసిన ఒక దర్శకుడు చాలా చెడు స్వభావం గల వ్యక్తి. షూటింగ్ సమయంలో పలుమార్లు నా శరీర భాగాలని తాకుతు లైంగికంగా వేధించాడు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెబితే మొదటి సినిమా కదా సర్దుకుపోవాలని అన్నారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయాను. నన్నే కాదు సినిమా పేరు చెప్పి మైనర్ బాలికలతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. అసలు ఆ దర్శకుడి సినిమాల్లో ఎవరు నటించాలని అనుకోరు. అతని పేరు పలకడానికే సిగ్గుగా ఉంది. అతడు నా పెళ్లిని లవ్ జిహాద్ అనడానికి కారణం నాపై ఉన్న కక్ష. నాపై లవ్ జిహాద్ ఆరోపణలు చేస్తున్నందుకు ఆ దర్శకుడిపై పోలీసులకి ఫిర్యాదు చేయబోతున్నాను. మాకు గుడిలో హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరగడంతో పాటు చట్టబద్ధంగా కూడా పెళ్లి జరిగింది. ఆ విషయం దేశంలో అందరికీ తెలుసు. నన్ను, నా భర్తని చంపేస్తామని కొంత మంది బెదిరిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రంతో పాటు , కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోరతామని చెప్పుకొచ్చింది.
Also read: Anushka Sharma: కింగ్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ.. షాక్ ఇచ్చిన పీఆర్ టీం!
తన స్పీచ్ లో సనోజ్ మిశ్రా పేరు మోనాలిసా చెప్పకపోయినా సనోజ్ ని ఉద్దేశించే ఆమె మాట్లాడిందనే విషయం అర్ధమవుతుంది. కుంభమేళాతో మోనాలిసా ఫేమస్ అయిన తర్వాత సనోజ్ నే ఆమెకి సినిమా ఆఫర్ ఇచ్చాడు. ఆ ఇద్దరి పిక్స్ కుడా సోషల్ మీడియాలో ఉన్నాయి. సినిమా అప్డేట్ గురించి అయితే ప్రెజెంట్ ఎలాంటి న్యూస్ జనరేట్ అవ్వడం లేదు.

![]() |
![]() |