![]() |
![]() |

మన శంకర వర ప్రసాద్ గారు సక్సెస్ ని అందుకున్నాడా!
ఫ్యాన్స్, ప్రేక్షకులు ఏమంటున్నారు
బడ్జెట్ ఎంత
తీసుకున్న రెమ్యునరేషన్స్ ఇవేనా
నువ్వు ఎదుటి వాళ్ళ జీవితం విషయంలో ఎన్ని నాటకాలు చేసినా విధాత రాసే విధి ముందు.. నువ్వెంత.. నీ స్థాయి ఎంత.. జుజుబీ.. అనే వైఫ్ అండ్ హజ్బండ్ కాన్సెప్ట్ తో కూడిన లైన్ కి ఎంటర్ టైన్ మెంట్ కోణాన్ని జోడించి చెప్పిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. ఎలాంటి ఆర్బాటాలకి పోకుండా సమాజంలో నిత్యం మనుషుల మధ్య మెదులుతు ఉండే ప్రేమ, పంతాలు, కోపాలు, ఈర్ష్య, ఆనందం, అనురాగం,ఆప్యాయత,భావోద్వేగాల్ని ప్రధాన ఎలిమెంట్స్ గా చెప్పడంతో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతున్నారు. స్క్రీన్ ప్లే కి ఉన్న దమ్ముని కూడా మరోమారు చాటి చెప్పడంతో పాటు చిరంజీవి, వెంకటేష్, నయనతార, సచిన్ ఖేడ్ కర్ నుంచి ప్రధాన తారాగణాన్ని అనిల్ రావిపూడి ఉపయోగించుకున్న తీరు అలనాటి తెలుగు సినిమాలని గుర్తుకు తెస్తున్నాయని చాలా మంది ప్రేక్షకులు చెప్తున్నారు.
దీంతో సోషల్ మీడియాలో మన శంకర వరప్రసాద్ గారు ట్రెండింగ్ లో ఉండటంతో పాటు మూవీకి సంబంధించిన పలు విషయాలు వైరల్ గా మారాయి. అందులో రెమ్యునరేషన్స్ అంశం కూడా ఒకటి. చిరంజీవి సుమారు 70 కోట్ల రూపాయిల మేర రెమ్యునరేషన్ తీసుకున్నాడని, వెంకటేష్ 9 కోట్లు, నయనతార 6 కోట్లు, అనిల్ రావిపూడి 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ నే రెమ్యునరేషన్ వివరాలని అధికారకంగా ప్రకటించాలి.
Also read: సరికొత్త డిమాండ్ ని తెరపైకి తెస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్.. మీరు నిజంగానే ఆర్మీ
సుమారు ఇరవై నిమిషాల పాటు వెంకీ గౌడ అనే క్యారక్టర్ లో వెంకటేష్ సందడి చెయ్యగా, చిరంజీవి కూతురు సుస్మిత తో కలిసి సాహు గారపాటి నిర్మించాడు. ఇప్పటికే ఈ ఇద్దరు మన శంకర వర ప్రసాద్ గారు 2026 బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మన శంకర వరప్రసాద్ నిలిచిందని సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే విజ యోత్సవ సభ ని నిర్వహించనున్నారు.
![]() |
![]() |