![]() |
![]() |

-మన శంకర వరప్రసాద్ గారికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్
-అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిమాండ్
-ఫ్యాన్స్ మాట అల్లు అర్జున్ వింటాడా
-అనిల్ రావిపూడి నెక్స్ట్ హీరో ఎవరు
వరల్డ్ వైడ్ గా నిన్న ప్రీమియర్స్ తో అడుగుపెట్టిన 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Varaprasad Garu)పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్నాడు. మెగా, విక్టరీ కాంబోలో వచ్చిన సీన్స్ తో పాటు నయనతార(Nayanthara),చిరంజీవి మధ్య కెమిస్ట్రీ, కామెడీ సీన్స్, చైల్డ్ సెంటిమెంట్, యాక్షన్ ఎపిసోడ్ ఇలా చెప్పుకుంటు పోతే టోటల్ గా దర్శకుడు అనిల్ రావిపూడి పనితనంపై మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి(Chiranjeevi)కి అభిమానులు, ప్రేక్షకుల్లో ఉన్న మాస్ ఇమేజ్ ని ఏ మాత్రం తగ్గించకుండా చిరంజీవి క్యారక్టర్ ని ఎంటర్ టైన్ కోణంలో కూడా ఉపయోగించుకున్న విధానానికి ప్రతి ఒక్కరు ఎంతగానో ఫిదా అవుతున్నారు. కొంత మంది హీరోల అభిమానులు అయితే తమ అభిమాన హీరో అనిల్ రావిపూడి(Anil Ravipudi) మార్క్ తో సంక్రాంతి సినిమాతో తమ ముందుకు రావాలని కోరుకుంటున్నారు.
అలా కోరుకుంటున్న అభిమానుల్లో ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)అభిమానులు కూడా ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాల్లోనే కాకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లోను చెయ్యాలి. ఇప్పటికే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జోనర్ లో అల వైకుంఠపురం లాంటి సినిమా చేసి రికార్డు కలెక్షన్స్ తో తన సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి తో ఒక సినిమా చెయ్యాలి. పుష్ప 2 తర్వాత తక్కువ బడ్జెట్ లో ఒక సినిమాచేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ సినిమా అనిల్ రావిపూడి తోనే చెయ్యాలి. ఆ ఇద్దరి కాంబో సెట్ అయితే రికార్డులకి సరికొత్త పేరుని కనిపెట్టే రికార్డులు వస్తాయని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also read: ఏంటి పరిస్థితి!.. మన శంకర వర ప్రసాద్ గారికి హిట్ టాక్ వినపడుతుంది
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ(Atlee)తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతుండగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. 2024 లో అల్లు అర్జున్ పుష్ప 2 తో పాన్ ఇండియా వ్యాప్తంగా సత్తా చాటిన విషయం తెలిసిందే. అంటే మూడేళ్ళకి అట్లీ మూవీ తో వస్తాడు. మరి అంతంత గ్యాప్ అనేది లేకుండా అట్లీ మూవీ కంప్లీట్ అయ్యాక అయినా అభిమానుల మాట విని అనిల్ రావిపూడి తో సినిమా చేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |