సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)దర్శకధీరుడు రాజమౌళి(rajamouli)కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్నీ ఆ చిత్రానికి కథని అందిస్తున్న విజయేంద్రప్రసాద్(vijayendraprasad)ఇటీవలే వెల్లడి చేసాడు.ఇండియన్ సిల్వర్ పై ఇంతవరకు కనివిని ఎరుగని హై బడ్జట్ తో దుర్గ ఆర్ట్స్ అధినేత కె ఎల్ నారాయణ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న జక్కన్న ఇప్పుడు లొకేషన్స్ వేటలో పడ్డాడు.అందులో భాగంగా కెన్యా(kenya)లోని అంబో సెలి నేషనల్ పార్క్ ని సందర్శించాడు. ఈ విషయాన్ని జక్కన్న తనయుడు కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో పాటుగా ఒక వీడియో కూడా రిలీజ్ చేసాడు. ఒక పొడవాటి వాన్ లో వెళ్తున్న జక్కన్న ఆ పరిసర ప్రాంతం మొత్తాన్ని గమనిస్తూ ఉన్నాడు. పైగా ఆ వీడియో చూస్తుంటే యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కబోతుందనే వార్తలకి బలం చేకూరినట్టయింది.
మూవీని రెండు బాగాలుగా తెరకెక్కించే ప్లాన్ లో కూడా జక్కన్న ఉన్నాడనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి.అమెజాన్ అడవుల నేపథ్యంలో జరిగే అడ్వెంచర్ మూవీ కావడంతో కథలో ఎంతో స్పాన్ ఉందని, కాబట్టి రెండు మూడు గంటల్లో చెప్పడం కుదరదనే జక్కన్న ఆ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. బాహుబలి(baahubali)ఆర్ఆర్ఆర్(rrr)తో వచ్చిన ఇమేజ్ దృష్ట్యా జక్కన్న ఈ మూవీని గ్లోబల్ లెవల్లో తెరకెక్కించబోతున్నాడని,ఇండియన్ నటులే కాకుండా హాలీవుడ్ కి చేసిన నటులు కూడా నటించబోతున్నారని తెలుస్తుంది.