తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ (NTR)తో ఒక దీపం వెలిగింది, సూపర్ స్టార్ కృష్ణ(Krishna)తో వియ్యాలవారి కయ్యలు, శోభన్ బాబు తో కోడళ్లువస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు,కృష్ణంరాజు తో వినాయక విజయం, అక్కినేని నాగేశ్వరరావు(ANR)తో ప్రతి బింబాలు వంటి చిత్రాలని నిర్మించిన జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి (Jagarlamudi Radhakrishna Murthy) తుది శ్వాస విడిచారు.
ఎనబై ఐదు సంవత్సరాల వయసు గల రాధా కృష్ణ మూర్తి మూడు రోజుల క్రితం అస్వస్థతకి గురవ్వడంతో వయోభారం వల్లనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అంత్యక్రియలు స్వగ్రామం బాపట్ల జిల్లా కారంచేడు లో ఆదివారం జరిగాయి. ఆయనకి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉండగా సతీమణి సంవత్సరం క్రితమే పరమపదించారు. రాధా కృష్ణ మూర్తి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులుతో పాటు నిర్మాతల మండలి తమ సంతాపాన్ని తెలియచేసింది.
అక్కినేని తో చేసిన ప్రతిబింబాలు మూవీ 1982 లో విడుదల కావలసి ఉన్న కొన్ని కారణాల రీత్యా విడుదల కాలేదు. కానీ ఎంతో పట్టుదలతో సుమారు నలభై ఏళ్ల తర్వాత అక్కినేని జయంతి సందర్భంగా రిలీజ్ చేసి తన పంతం నెగ్గించుకున్నారు.