హీరో కిరణ్ అబ్బవరం(kiran abbavaram)దివాళి కానుకగా ఈ నెల 31 న 'క'(ka)అనే మూవీతో రాబోతున్నాడు.1970 వ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ జోనర్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సుజీత్, సందీప్ ల ద్వయం దర్శకత్వం వహిస్తుంది. తన్వి రామ్(tanvi ram)నయన్ సారిక(nayan sarika)హీరోయిన్స్ గా చేస్తుండగా చింతా గోపాల కృష్ణ రెడ్డి నిర్మిస్తున్నాడు.ట్రైలర్ అండ్ ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉండటంతో మూవీపై అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి.
రీసెంట్ గా మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ప్రేక్షకులకు విభిన్నమైన కథలు అందించాలని ఎప్పుడు ప్రయతిస్తుంటాను. 2022 న రిలీజైన వినరో భాగ్యము విష్ణు కథ విడుదలకి నెలకి ముందు 'క' కథని ఓకే చేశాను. 'క' లాంటి కాన్సెప్ట్ తో ఇంతవరకు ఏ సినిమా కూడా రాలేదు.ఒక వేళ వచ్చిందని నిరూపిస్తే సినిమాలు చెయ్యడం మానేస్తాను.ఈ కథ విన్నపుడు చివరి ఇరవై నిముషాలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.వెండి తెరపై ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఒక కొత్త ఎమోషన్ ని ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నాం.
థియేటర్ లో సినిమా పూర్తయ్యే సమయానికి ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యానికి గురవవుతారు.కంటెంట్ మీద కథ నడుస్తూ ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతుంది. వాసుదేవ్ అనే ఒక అనాధకి పక్క వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది.ఆ కారణంతో వేరే వాళ్ళ ఉత్తరాలు చదువుతుంటాడు. పోస్ట్ మెన్ అయ్యాక కృష్ణ గిరి అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఏం జరిగిందనేదే ఈ కథ అని చెప్పుకొచ్చాడు.