మూగ జీవాల సంరక్షణ కోసం శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ పేరుతో నటి రేణూ దేశాయ్ (Renu Desai) ఒక ఎన్జీవో ను ప్రారంభించారు. దీని కోసం ఆమె విరాళాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా తన వంతు సాయం చేశారు.
మూగ జీవాల కోసం తాజాగా రేణూ దేశాయ్ అంబులెన్స్ ని కొనుగోలు చేశారు. ఈ అంబులెన్స్ కోసం తమ పెంపుడు కుక్క రైమ్ పేరుతో ఉపాసన విరాళం అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రైమ్ కి, ఉపాసన కి థాంక్స్ చెబుతూ.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు రేణూ.
రామ్ చరణ్, ఉపాసన దంపతులకి కూడా మూగ జీవాలంటే ఇష్టం. పలు మూగ జీవాలను పెంచుతుంటారు. ఆ మక్కువతోనే మూగ జీవాల సంరక్షణ కోసం రేణూ దేశాయ్ ప్రారంభించిన ఎన్జీవోకు తమ వంతు సాయం అందించారు.