![]() |
![]() |

సూపర్ స్టార్ రజినీకాంత్ ని భాయ్ పాత్రలో చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఇష్టపడతారు. బిగ్ స్క్రీన్ పై భాయ్ గా ఆయన స్టైల్ గా నడిచొస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అభిమానులు థియేటర్లలో అసలుసిసలైన పండుగ చేసుకుంటారు. అలాంటి పండగ వాతావరణాన్ని అందించడానికి మొయిద్దీన్ భాయ్ గా సూపర్ స్టార్ ఎంట్రీ ఇస్తున్నారు.
'3' సినిమాతో దర్శకురాలిగా పరిచయమై ఆకట్టుకున్న సూపర్ స్టార్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో ప్రస్తుతం 'లాల్ సలాం' అనే చిత్రం రూపొందుతోంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో మొయిద్దీన్ భాయ్ అనే పవర్ ఫుల్ పాత్రలో రజినీకాంత్ నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈరోజు విడుదల చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో ముంబైలో అల్లర్లు జరుగుతుండగా.. మొయిద్దీన్ భాయ్ గా సూపర్ స్టార్ నడిచొస్తున్న స్టైల్ చాలా పవర్ ఫుల్ గా, ఆకట్టుకునేలా ఉంది.

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'లాల్ సలాం' చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
మరోవైపు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' అనే సినిమా చేసున్నారు రజినీకాంత్. శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 10 న ప్రేక్షకుల ముందుకి రానుంది.
![]() |
![]() |