![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ముంబైలో జరిగిన షూటింగ్ లో పవన్, ప్రియాంక పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పవన్ తనయుడు అకీరా నందన్ వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది.
19 ఏళ్ళ అకీరా నందన్ సినీ రంగ ప్రవేశం కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఓ షార్ట్ ఫిల్మ్ కి సంగీతం అందించి సర్ ప్రైజ్ చేసిన అకీరా.. త్వరలోనే అభిమానుల కోరిక తీర్చబోతున్నట్లు సమాచారం. 'ఓజీ' సినిమాలో ఓ కీలక పాత్రలో అకీరా మెరవనున్నాడట. 'ఓజీ'లో పవన్ పాత్ర మూడు దశల్లో ఉంటుందట. టీనేజ్ కుర్రాడిగా, యువకుడిగా, గ్యాంగ్ స్టర్ గా ఇలా మూడు దశల్లో చూపిస్తారట. అయితే 15 నిమిషాల పాటు ఉండే టీనేజ్ కుర్రాడి పాత్రలో అకీరా నందన్ నటిస్తే బాగుంటుందని సుజీత్ సూచించాడట. దీంతో పవన్ 'ఓజీ' కోసం అకీరాను రంగంలోకి దింపబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. నిజమైతే మాత్రం పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.
![]() |
![]() |