![]() |
![]() |

ఈ ఏడాది మార్చిలో 'తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం' అధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 23 విభాగాలకు గాను 25 మంది జర్నలిస్టులను ఈ అవార్డుల కోసం ఎంపిక చేశారు. ఈ జాబితాలో 'తెలుగు వన్' రెండు ప్రతిష్టాత్మక విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. సినిమా విభాగంలో సీనియర్ జర్నలిస్టు బుద్ధి యజ్ఞమూర్తి, అగ్రికల్చర్ విభాగంలో సీనియర్ జర్నలిస్టు ఎస్.కె సలీం ఉత్తమ జర్నలిస్టులుగా పురస్కారాలు గెలుచుకున్నారు. యజ్ఞమూర్తి 'తెలుగువన్.కామ్' వెబ్ సైట్ కి ఎడిటర్(సినిమా) కాగా, ఎస్.కె సలీం తెలుగువన్ అగ్రికల్చర్ ఛానల్ కి చీఫ్ ఎడిటర్ & రిపోర్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కార ప్రధానోత్సవం మే 2న గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. అలాగే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలతో పాటు పలువురు జర్నలిస్టులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా 'తెలుగు వన్' జర్నలిస్టులు బుద్ధి యజ్ఞమూర్తి, ఎస్.కె సలీం అవార్డులు అందుకున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డులు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

అక్షరాస్త్రాలతో సమాజాన్ని చైతన్య పరిచే బృహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్న పాత్రికేయులను ఉగాది పురస్కారాల ద్వారా సత్కరించి, గౌరవించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు అన్నారు.
![]() |
![]() |