![]() |
![]() |

భగవంతుడు ఎవరికైనా ఒకటే... అమ్మాయి అయినా, అబ్బాయి అయినా దేవుడికి సమానమే అని అంటున్నారు నటి ఐశ్వర్య రాజేష్. మలయాళంలో విడుదలై పెద్ద హిట్ అయిన 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' సినిమాను తమిళ్లో రీమేక్ చేశారు ఐశ్వర్య. దర్శకుడు ఆర్ కన్నన్ ఈ సినిమాను రూపొందించారు. ఐశ్వర్య, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల మాట్లాడారు ఐశ్వర్య రాజేష్.
ఆమె మాట్లాడుతూ "దేవుడు ఎవరికైనా ఒకటే. అమ్మాయి అబ్బాయనే తేడా దేవుడికి ఎప్పుడూ ఉండదు. ఎవరైనా గుడిలోకి రావచ్చు. వీళ్ళు రావచ్చు, వాళ్ళు రాకూడదు అని దేవుడు ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. కొన్ని విషయాల్ని మనంతటం మనమే కట్టుబాట్లుగా నియమించుకున్నాం. శబరిమల మాత్రమే కాదు... ఏ గుడిలో అయినా సరే దేవుడికి భక్తులు అంటే ఇష్టమే. ఈ భక్తులు రాకూడదు, వాళ్లే రావాలి... ఈ ప్రసాదం వీళ్ళు తినకూడదు, వాళ్లే తినాలి. వీళ్లు అంటరాని వాళ్ళు... వాళ్లు నాకు దగ్గర వాళ్లు అని ఎప్పుడూ ఏ దేవుడు చెప్పలేదు. ఇవన్నీ మనమే క్రియేట్ చేసుకున్నాం. భగవంతుడికి ఏమాత్రం సంబంధం లేని ఇలాంటి విషయాలను ఆయనకు ఆపాదించడం నా దృష్టిలో తప్పే. పీరియడ్స్ టైం లో మహిళలు గుడిలోకి వెళ్ళకూడదని కూడా ఏ దేవుడు చెప్పలేదు. ఈ విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటివాటిని నేను అసలు నమ్మను" అని గట్టిగానే మాట్లాడారు ఐశ్వర్య రాజేష్. ఇటీవల ఆమె నటించిన డ్రైవర్ జమున సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది.
![]() |
![]() |