![]() |
![]() |

రకులే కాదు భారతీయ చలనచిత్రానికి సంబంధించిన ఏ నటీనటులైనా విశ్వ నటుడు కమలహాసన్ కు వంకపెట్టలేరు. ఆయనను లెజెండ్ గా అందరూ గౌరవిస్తారు. ఆయన ఒక విశ్వవిద్యాలయం వంటి వారు. వందేళ్ళ సినీ చరిత్రలో 60 ఏళ్ల పాటు ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన అంతటి సీనియర్ నటుడు. ఆయన వెరైటీ చిత్రాలను ఎంచుకోవడం, పాత్రల కోసం ప్రాణం పెట్టడం, ఆ పాత్రను కమల్ తప్ప ఇంకెవరూ చేయలేరని నిరూపించుకోవడం కమల్ కు కొత్తేమి కాదు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రంలో కమలహాసన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ చిత్రానికి దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ తమిళంలో శివకార్తికేయన్ హీరో పొందుతున్న అయలాన్ చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సందర్భంగా కమల్ పై రకుల్ ప్రశంసల వర్షం కురిపించింది. అడ్డదారిలో విజయాలు రావని మనకు తెలియజేసే నటుడు కమల్. పనిలో శ్రద్దతో పాటు పనిని నిబద్ధతతో చేస్తే మనము విజయం సాధించగలమని కమలహాసన్ తెలియజేశారు అని చెప్పుకొచ్చింది.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ విషయానికొస్తే టాలీవుడ్ లో ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. 2015 నుండి 2017వరకు దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. మహేష్ తో చేసిన ద్విభాషా చిత్రం స్పైడర్ డిజాస్టర్ అయింది. మురగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తమిళ, బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ వస్తోంది. ఖాకీ చిత్రంతో సక్సెస్ అందుకున్నా మరల ఆమెకు అవకాశాలు లేవు. అయ్యారే అనే హిందీ చిత్రంతో నటించి బాలీవుడ్ బాట పట్టిన రకుల్ అక్కడ కూడా పలు ఇబ్బందులను ఫేస్ చేస్తుంది. హిట్ కోసం ఎదురుచూస్తోంది. అయ్యారే చిత్రం బ్లాక్ బస్టర్ అనిపించుకుంది గాని రకుల్ కి మాత్రం అవకాశాలను తెచ్చి పెట్టలేకపోయింది. దాంతో ప్రస్తుతం రకుల్ దింపుడు కళ్లెం ఆశలన్నీ ఇండియన్ 2 చిత్రంపైనే ఉన్నాయి.
![]() |
![]() |