![]() |
![]() |

తాజాగా సునీల్ పుష్ప ది రూల్ చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయ్యారు. పుష్పదీ రూల్ చిత్రం పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈయనకు దేశంలోని అన్ని భాషల వారు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఆయనకు ఇతర భాషలలో కూడా మంచి అవకాశాలు, మంచి వేషాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సునీల్ మరో జాక్ పాట్ కొట్టారు. ఏకంగా రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. సునీల్ గతంలో రజినీకాంత్ తో కథానాయకుడు చిత్రంలో కమెడియన్ గా నటించారు.
ఇప్పుడు మరో మారు రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని సునీల్ ఫోటోలు చూస్తే పుష్పాలోని మంగళం శీను ఛాయలోనే కనిపిస్తోంది. ఈ చిత్రంలో కూడా ఆయన విలన్‌గా నటిస్తున్నారా? మరి ఏదైనా సర్ప్రైజ్ ఉందా? అనేది వేచి చూడాలి. కాగా ఇంతకుముందే సునీల్ రెండు తమిళ సినిమాలలో నటించారు. ఇక జైలర్ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోంది.
ఇందులో ఆల్రెడీ కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ లెజెండ్ మోహన్ లాల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పుడు తెలుగులో ఒకప్పటి కమెడియన్ ఇప్పుడు విలన్‌గా నటిస్తూ ఉన్న సునీల్ నటిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో దయానిది మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ తో ఢీకొట్టే పాత్రలో సునీల్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం సునీల్ కు ఏకంగా రెండు కోట్ల రెమ్యూనేషన్ ఇచ్చారట. మొత్తం మీద పుష్పా చిత్రం సునీల్ కు బాగా కలిసి వచ్చింది. గతంలో శివాజీ చిత్రంలో కూడా సుమన్ విలన్ పాత్రను పోషించి అద్భుతంగా పండించి మెప్పించారు. అదే తరహాలో సునీల్ కూడా జైలర్ చిత్రంతో మెప్పిస్తే అది ఆయన కెరీర్ కు, ఇతర భాషల్లో ఆయనకున్న క్రేజ్ కు మరింత బలం చేకూరుస్తుందని చెప్పవచ్చు.
![]() |
![]() |