![]() |
![]() |

``ఊరిని దత్తత తీసుకోవడం`` అనే కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం `శ్రీమంతుడు`. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన మొదటి సినిమా ఇది. అంతేకాదు.. ఈ సోషల్ డ్రామాతోనే హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. మహేశ్ బాబుకి జోడీగా శ్రుతి హాసన్ నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, సితార, ముకేశ్ రిషి, సంపత్ రాజ్, హరీశ్ ఉత్తమన్, తులసి, సుబ్బరాజు, రాహుల్ రవీంద్రన్, తేజస్వి, సనమ్ శెట్టి, వెన్నెల కిశోర్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. ``రామ రామ``, ``జత కలిసే``, ``దిమ్మ తిరిగే``, ``జాగో``, ``పోరా శ్రీమంతుడా``, ``చారుశీలా``.. ఇలా ఇందులోని గీతాలన్ని విశేషాదరణ పొందాయి. నాలుగు నంది పురస్కారాలను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్న `శ్రీమంతుడు``.. 2015 ఆగస్టు 7న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ సినిమా ఆరేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |