![]() |
![]() |
![]()
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్' సీక్వెల్స్ ముందు వరుసలో ఉన్నాయి. రానున్న కొద్ది సంవత్సరాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా ఆ సీక్వెల్స్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ బృందం కృషి చేస్తోంది. ఈ ఏడాది 'అవతార్ 2' కోసం ఆ బృందం తీవ్రంగా శ్రమిస్తూ వచ్చింది. దానికి సంబంధించి ఇదివరకు కొన్ని తెరవెనుక సన్నివేశాలకు సంబంధించిన పిక్చర్స్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌కు సంబంధించి 2020 చివరి వర్కింగ్ డే సందర్భంగా కొన్ని ఆసక్తికర స్నాప్‌షాట్స్‌ను జేమ్స్ కామెరాన్ పంచుకున్నారు. ఆయన ఎలాంటి టెక్నాలజీని వాడుతున్నారో ఆ పిక్చర్స్ తెలియజేస్తున్నాయి.
'ద మెటడోర్' అనే ఒక జెయింట్ ఫార్వార్డ్ కమాండ్ బోట్‌ను ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ప్రొడక్షన్‌లో తాము ఉపయోగిస్తున్న కొన్ని టెక్నోక్రేన్స్ గురించిన సమాచారం కూడా ఫ్యాన్స్‌కు ఆయన అందజేశారు. "The last set for 2020 filming —The Matador (a 50’ forward command boat) on a 16-ton, 360 degree motion-control base. Three Technocranes and a Russian Arm mounted on top of a Mercedes-Benz. Just another day on the set of the Avatar sequels." అని ఆయన ట్వీట్ చేశారు.
![]()
టెక్నాలజీ విషయం పక్కన పెడితే, సెట్ ఫొటోస్ ద్వారా ఇతర అద్భుతమైన దృశ్యాలు కూడా బయటపడ్డాయి. ఈ షూటింగ్‌లో అండర్‌వాటర్ సీన్స్‌ను కూడా తీశారు. సిగౌర్నీ వీవర్, కేట్ విన్‌స్లెట్ లాంటి యాక్టర్లు కొలనుల దగ్గర పనిచేస్తున్నట్లు స్నాప్‌షాట్స్ బయటపెట్టాయి. ఆ సన్నివేశాల్లో నటించడంపై విన్‌స్లెట్ ఇప్పటికే మాట్లాడింది. అవి ఇంటెన్స్ సీన్లు మాత్రమే కాదనీ, వాటిలో నటించడాన్ని గర్వంగా భావిస్తున్నాననీ ఆమె చెప్పింది.
![]()
ఒరిజినల్ ఫిల్మ్ వచ్చి బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టిన పదమూడేళ్ల తర్వాత పండోరా ప్రపంచాన్ని ఆడియెన్స్ ముందుకు తెచ్చేందుకు 'అవతార్ 2' రెడీ అవుతోంది. జేక్ సల్లీ, నేతిరి జంట ఈ సీక్వెల్‌లో ఓ ఫ్యామిలీగా మన ముందుకు వస్తోంది. పాత శత్రువులు మళ్లీ తమ మీదకు దాడికి వస్తే, ఆ జంట ఎలా వారిని ఎదుర్కొన్నారో ఈ మూవీలో మనం చూడబోతున్నాం. 2022 డిసెంబర్ 16న.. అంటే ఇంకో రెండేళ్లకు ఈ సినిమా విడుదల కానున్నది.
![]() |
![]() |