![]() |
![]() |

మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌పై మరోసారి కాపీ క్యాట్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే సినిమాకు సంబంధించి రెండోసారి అతనిపై ఈ ఆరోపణలు వస్తుండటం గమనార్హం. ఆ సినిమా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న 'క్రాక్'. ఇదివరకు రవితేజ, అప్సరా రాణిపై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ "భూమ్ బద్దల్" విషయంలో కాపీ ట్యూన్స్ అంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది వచ్చిన 'ప్రశ్నిస్తా' అనే సినిమాలో వర్థమాన సంగీత దర్శకుడు వెంగీ బాణీలు ఇచ్చిన స్పెషల్ సాంగ్ "ఏం పర్లేదు ఏం పర్లేదు" సాంగ్ ట్యూన్స్‌ని ఆ పాటలో దించేశాడంటూ నెటిజన్లు మీమ్స్‌తో తమన్‌ను ఆటపట్టించారు.
ఇప్పుడు మరో పాట విషయంలోనూ ట్విట్టర్‌లో తమన్‌పై మీమ్స్ జోరుగా నడుస్తున్నాయి. ఇటీవల 'క్రాక్' సినిమాకే సంబంధించి రవితేజ, శ్రుతి హాసన్‌పై తీసిన "బల్లేగా తగిలావే బంగారం" అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనిరుధ్ రవిచందర్ చేత పాడించారు. క్యాచీగా ఉండటంతో ఈ పాటకు వ్యూస్ బాగా వస్తున్నాయ్.
ఈ పాటలో శ్రుతి అందచందాలను పొగుడుతూ, ఆమెను అల్లరి పెడుతుంటాడు రవితేజ. అయితే ఈ సాంగ్ ట్యూన్స్ ఓ లాటిన్ మూవీ నుంచి కాపీ కొట్టినవంటూ నెటిజన్లు కనిపెట్టేశారు. 'Selva El Neon' అంటూ సాగే ఒరిజినల్ సాంగ్ ట్యూన్‌ను షేర్ చేసి, తమన్‌పై మీమ్స్ పెడుతున్నారు. ఆ మీమ్స్‌తో వారు వాడుతున్న పదజాలం చూస్తే.. తమన్ ఏమైపోతాడో! ఇదివరకు 'అల.. వైకుంఠపురములో' మూవీలోని "రాములో రాములా" సాంగ్ విషయంలోనూ తమన్‌ను కాపీరాయుడంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. కాపీ ట్యూన్స్‌తోటే తమన్ క్రేజ్ తెచ్చుకున్నట్లుగా ఉందని ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
![]() |
![]() |