![]() |
![]() |

నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ వివాహ వేడుకలు ముగిశాయి. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో తమ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిపించారు రెండు కుటుంబాలవారు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలంతా ఈ పెళ్లి వేడుకలో పాల్గొని, నిహారికను ఆనందడోలికల్లో ముంచెత్తడమే కాకుండా, ఆమెకు మరపురాని తీపి జ్ఞాపకంగా ఈ వివాహ వేడుకను మిగిల్చారు.
కాగా ఉదయ్‌పూర్‌లో జరిగిన పెళ్లి వేడుక కోసం తన కొత్తబావను ఊరేగింపుగా తీసుకొచ్చిన బారాత్ వేడుకకు సంబంధించిన ఫొటోలను బావమరిది వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నాడు. ఆ ఫొటోలకు "Baraat for the new bava!" అనే క్యాప్షన్ పెట్టాడు వరుణ్. ఇప్పుడు ఆ ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
.jpg)
వాటిలో ఓ పిక్చర్‌లో టాప్‌లెస్ వెహికల్‌లో డాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు చైతన్య. అతడి డాన్స్ చూస్తూ మామ నాగబాబు, బావమరిది వరుణ్ తేజ్ చిరునవ్వులు చిందిస్తున్నారు ఇంకో పిక్చర్‌లో. మరో ఫొటోలో వరుణ్‌తో పాటు సాయితేజ్ కూడా బావను చూస్తూ వాళ్లు కూడా ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నారు. ఆ పిక్చర్స్ చూస్తుంటే చాలు.. చైతన్యను నాగబాబు కుటుంబం ఎంతగా అభిమానిస్తుందో, ప్రేమిస్తుందో తెలిసిపోతోంది.
.jpg)
.jpg)
![]() |
![]() |