Home  »  News  »  Summer Holidays: సమ్మర్ హాలిడేస్ టీజర్ రివ్యూ.. అమ్మమ్మ ఊరు, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే మూవీ!

Updated : May 27, 2026

ప్రతి ఒక్కరి జీవితంలోనూ చిన్ననాటి వేసవి సెలవుల జ్ఞాపకాలు ఎంతో మధురంగా ఉంటాయి. అమ్మమ్మ ఊరు, మామిడి తోటలు, స్నేహితులతో కలిసి ఆడే ఆటలు, సైకిల్ ప్రయాణాలు ఇలా ఎన్నో మధురమైన క్షణాలు మన మనసులో నిలిచిపోతాయి. ఇప్పుడు సరిగ్గా అదే నాస్టాల్జియాను, స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ వస్తున్న చిత్రం 'సమ్మర్ హాలిడేస్' (Summer Holidays). 

ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు వీజీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ తాజాగా విడుదలైంది. శ్రీకర్ నయన్ జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా, ప్రతి ఒక్కరిని తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్లేలా ఉంది. (Summer Holidays Teaser)

ఈ టీజర్ ప్రారంభంలో ఒక చిన్న పిల్లోడికి(అరుణ్ ) వాళ్ల అమ్మ (వాసుకి) "ఈ సమ్మర్ హాలిడేస్ కి మనం అమ్మమ్మ ఊరికి వెళ్దామా?" అని అడగడంతో కథ పల్లెటూరి వాతావరణంలోకి మారుతుంది. గోదావరి అందాలు, పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు వంటి అందమైన విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఊరిలో పేపర్ వేసే ఒక పిల్లాడు(రోహన్), స్కూల్ అయిపోయాక పిల్లలందరూ కలిసి సైకిళ్లపై తిరిగే సీన్లు పక్కా లోకల్ నేటివిటీని ప్రతిబింబిస్తున్నాయి. క్లాస్ రూమ్‌లో సార్ బెత్తం పట్టుకుని వస్తుంటే పిల్లలు చేసే అల్లరి, బెంచీలపై రాసుకునే పేర్లు ఎంతో సహజంగా ఉన్నాయి. వీటికి తోడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌ను మరింత అందంగా మార్చింది.

సినిమాలో ప్రధానంగా స్నేహం, చిన్ననాటి అల్లరి నేపథ్యంలో సాగే కథాంశాన్ని చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. చిన్నప్పటి ఊరిలోనే పెరిగిన రోహన్, హాలిడేస్ కి ఊరికి వచ్చిన అరుణ్ మధ్య స్నేహం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

అలాగే క్రికెట్ కిట్ సర్దుకుంటూ అరుణ్ "కాసేపు క్రికెట్ ఆడుకుని వస్తాను డాడీ" అని అడగగా, వాళ్ల నాన్న "ఆడి.. ఇండియా టీమ్ కి ఆడేస్తావా?" అని సెటైర్ వేస్తాడు. దానికి కౌంటర్ అన్నట్టుగా రోహన్ "క్రికెట్ ఆడే ప్రతి ఒక్కడూ భారతదేశానికి ఆడేయాలని ఎక్కడ రాసిపెట్టి లేదు కదండీ" అని ఇచ్చే రిప్లై, దానికి పక్కనున్న వ్యక్తి "కుర్రాడు భలే సురుకు" అని మెచ్చుకోవడం హైలైట్ గా నిలిచింది.

టీజర్ ముగింపులో రోహన్, అరుణ్ సైకిల్‌పై వెళ్తూ.. "ఏంటి.. ముడ్డి నొప్పొస్తుందా, కూర్చోలేకపోతున్నావ్.. నువ్వే కాదు నీ పిర్రలు కూడా దూది లాగే ఉన్నాయి" అంటూ ప్యూర్ విలేజ్ స్లాంగ్‌లో మాట్లాడుకోవడం నవ్వులు పూయిస్తోంది. 

ఈ చిత్రానికి సింజిత్ యెర్రమిల్లి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగి సినిమాటోగ్రఫీ అందించారు. సంతోష్ నాయుడు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. టీజర్‌లో చూపించిన రోహన్, అరుణ్ ల నటన, శ్రీకర్ నయన్ జి టేకింగ్ చూస్తుంటే ఈ వేసవిలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఒక క్లీన్ అండ్ బ్యూటిఫుల్ ఎంటర్‌టైనర్ లభించబోతోందని స్పష్టమవుతోంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.