Home  »  News  »  గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్: ప్రియాంకా చోప్రా అసలు రహస్యం ఇదేనా! 

Updated : Aug 12, 2026

 

ప్రియాంక చోప్రా...సుదీర్గ కాలం నుంచి సినీ అభిమానులుగా ఉన్న వాళ్ళకి ప్రియాంక చోప్రా అనేది పేరు కాదు గ్లోబల్ లెవల్లో బ్రాండ్ అనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్, రాజమౌళి ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ వారణాసిలో మందాకినీగా బిజీగా ఉంది. ఆఫ్ కోర్స్ ప్రియాంకకి కూడా వారణాసి ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ నే. మేకర్స్ ఏరికోరి వారణాసి బ్రాండ్ ప్రపంచసినీ యవనిక పై సౌండ్ చేయాలని ప్రియాంకని ఎంపిక చేసుకున్నారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న  ప్రియాంకా చోప్రాకి కేవలం ఒకే ఒక్క సినిమాతో లేదా ఒకే ఒక్క ప్రాజెక్ట్‌తో ఆమెకి గ్లోబల్ క్రేజ్ రాలేదు. దశాబ్దాల కష్టం, వైవిధ్యమైన పాత్రల ఎంపిక, హాలీవుడ్ మరియు బాహుబలి తరహా ఇండియన్ గ్లోబల్ ప్రాజెక్ట్‌లను సమాంతరంగా మేనేజ్ చేయడం వెనుక ఉన్న పక్కా ప్లానింగ్ ఆమెను ఒక బలమైన అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చింది. ప్రతి దశలోనూ కొత్త సవాళ్లను స్వీకరిస్తూ, డిఫరెంట్ జానర్స్‌ను ఎంచుకుంటూ తను వేసే ప్రతి అడుగు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేలా చూసుకోవడంలో ప్రియాంకా చోప్రా సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇటీవలే ప్రియాంకా చోప్రా లైనప్‌లో మరొక భారీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేరింది. అదే ‘బ్లూఫ్లై’ (Bluefly). హాలీవుడ్ దిగ్గజ నటుడు రస్సెల్ క్రోతో కలిసి ఆమె నటించనున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నిమ్రోడ్ అంటాల్ తెరకెక్కిస్తున్నాడు. కాంగో నేపథ్యంలో సాగే సీక్రెట్ మిషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఎమోషనల్ క్యారెక్టర్‌లో ప్రియాంక కనిపించబోతుండటం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. 


Also read: మెగాస్టార్ మళ్లీ టైటిల్ లీక్ చేశారు: ఆచార్య సెంటిమెంట్ వెంటాడుతుందా!

ప్రియాంకా చోప్రా కెరీర్‌ను విశ్లేషిస్తే, ‘సీటాడెల్’ లాంటి భారీ వెబ్ సిరీస్‌ల ద్వారా ఇంటర్నేషనల్ డిజిటల్ ఆడియన్స్‌కు ఆమె అత్యంత సమీపమయ్యారు. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఎమోషనల్ డ్రామా అంటూ వరుసగా వైవిధ్యమైన జానర్లను ఎంచుకుంటూ తన పరిధిని విస్తరించుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు వస్తున్నప్పటికీ, తన మూలాలైన ఇండియన్ సినిమాను వదలకుండా బ్యాలెన్స్ చేయడం ఆమె ప్రత్యేకత. వారణాసితో పాటు ఫర్హాన్‌ అక్తర్ తెరకెక్కించబోయే ‘జీ లే జరా’, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘క్రిష్ 4’ లాంటి క్రేజీ బాలీవుడ్ చిత్రాలు కూడా చర్చల దశలో ఉండటం విశేషం. ఈ భారీ ప్రాజెక్ట్‌ల వరుసతో ప్రియాంకా చోప్రా తన గ్లోబల్ బ్రాండ్‌ను మరిన్ని ఎత్తులకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. 2000 వ సంవత్సరంలో ప్రపంచ సుందరిగా నిలిచిన ప్రియాంక చోప్రా తొలి చిత్రం తమిళన్. ఇళయ దళపతి విజయ్ హీరో కాగా 2002 లో రిలీజయ్యింది.  

Priyanka Chopra, varanasi, Mahesh Babu, Rajamouli






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.