![]() |
![]() |

-నిన్న వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అయిన పెద్ది
-ప్రీమియర్స్ తో కలుపుకొని ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్
-చరణ్ కెరీర్ లోనే అరుదైన రికార్డు
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో పెద్ది(Peddi)బాక్సాఫీస్ వద్ద తొలిరోజే ఊహించని రేంజ్లో విధ్వంసం సృష్టించింది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ పెద్దిలో చేసిన పెర్ఫార్మ్ కి, పర్ఫెక్ట్ మాస్ ఎలివేషన్స్ తోడవ్వడంతో అభిమానులు,ప్రేక్షకులు థియేటర్లకి బారులు తీరారు.
దీంతో ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజే 112.49 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించి సరికొత్త రికార్డులని సృష్టించింది. చరణ్ కెరీర్లోనే 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఈ స్థాయి భారీ ఓపెనింగ్స్ సాధించిన సోలో చిత్రం ఇదే కావడం విశేషం. బుధవారం సాయంత్రం నిర్వహించిన పెయిడ్ ప్రివ్యూ షోల నుంచే ఈ సినిమా ప్రభంజనం మొదలైంది. కేవలం ప్రివ్యూల ద్వారానే 18.50 కోట్ల నెట్ వసూళ్లు రావడం ఈ సినిమాపై ఉన్న విపరీతమైన అంచనాలకి అద్దం పడుతోంది. పాన్ ఇండియా వ్యాప్తంగా తొలి రోజు 12,412 షోలలో ప్రదర్శితమైంది. దేశీయంగా ఈ సినిమా సాధించిన మొత్తం గ్రాస్ కలెక్షన్స్ 82.49 కోట్లు కాగా, నెట్ కలెక్షన్స్ 69.50 కోట్లు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే అత్యధికంగా 48 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
also read: Peddi Movie Review In Telugu: పెద్ది మూవీ రివ్యూ
ఓవర్సీస్ మార్కెట్లో కూడా చరణ్ క్రేజ్ మరోసారి నిరూపితమైంది. మొదటి రోజు ఏకంగా 30 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించి ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యపరిచింది. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక నుండి 5.75 కోట్లు, తమిళనాడు నుండి 1.50 కోట్లు, కేరళ నుండి 25 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాది బెల్ట్‌లో హిందీ వెర్షన్ 3 కోట్ల వసూళ్లతో కాస్త నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, రాబోయే వారాంతంలో వసూళ్లు పుంజుకుంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మేకర్స్ నుంచి ఫస్ట్ డే కలెక్షన్స్ పై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
![]() |
![]() |