![]() |
![]() |

సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్ స్టేజ్‌లో దూసుకుపోతున్నారు. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలకు మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అందిస్తూనే, మరోవైపు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగానూ వెండితెరపై మెప్పిస్తున్నారు.
మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్న ఈ యంగ్ కంపోజర్ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఇస్తూ బిజీయెస్ట్ టెక్నీషియన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లలో చక్రం తిప్పుతున్నారు.
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 'ఇరుముడి' (Irumudi) చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ కాంబినేషన్‌పై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath and Sons) చిత్రానికి కూడా జి.వి. ప్రకాష్ కుమారే కంపోజర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో వింటేజ్ సూర్యను గుర్తుచేసేలా అద్భుతమైన ఆల్బమ్ సిద్ధమైందని సమాచారం.
ఒకవైపు ఈ టాప్ స్టార్ల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా కూడా తన జోరు చూపిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే లక్కీ ది సూపర్ స్టార్, హ్యాపీ రాజ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన జి.వి. ప్రకాష్.. ఇమ్మోర్టల్ సహా పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.
ఇలా ఒకే సమయంలో సంగీత దర్శకుడిగా స్టార్ హీరోల ప్రాజెక్ట్‌లు హ్యాండిల్ చేయడం, అదే క్రమంలో హీరోగా కొత్త సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడం సాధారణ విషయం కాదు. కానీ, జి.వి. ప్రకాష్ కుమార్ తనకున్న అద్భుతమైన ప్లానింగ్, మ్యూజిక్ సెన్స్‌తో ప్రతి ప్రాజెక్ట్‌ను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన అందించబోయే మ్యూజికల్ ఆల్బమ్స్ సౌత్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మల్టీ టాస్కింగ్‌తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ యంగ్ స్టార్ రాబోయే ప్రాజెక్టులతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
![]() |
![]() |