![]() |
![]() |

కాకినాడ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో తన 111వ సినిమా ('NBK 111') చిత్రీకరణలో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. 66 సంవత్సరాల వయస్సులోనూ డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చే బాలకృష్ణ, ఈ షూటింగ్‌లో కింద పడటంతో ఆయన మోకాలు కండరానికి గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్‌ను నిలిపివేసి, ఆయనకు కాకినాడలోని స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్య సహాయం కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ ఏఐజీ (AIG) ఆసుపత్రికి ఆయనను తరలించారు.
ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో చేరిన బాలకృష్ణకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆయన మోకాలు కండరం చిరిగినట్లు (Muscle Tear) వైద్యులు నిర్ధారించారు. ఈ గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి మైనర్ సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. ఈ రాత్రి లేదా రేపు ఉదయం ఏఐజీ ఆసుపత్రిలో ఈ సర్జరీ నిర్వహించనున్నట్లు సమాచారం.
సర్జరీ ముగిసిన తర్వాత బాలయ్య కనీసం ఒకటిన్నర నెలలు, అంటే సుమారు 45 రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. శరీరానికి ఎటువంటి శ్రమ కలగకుండా చూసుకోవాలని, ఎలాంటి షూటింగ్స్ లేదా పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనకూడదని డాక్టర్లు ఆదేశించారు.
Nandamuri Balakrishna, Muscle Tear, Surgery, AIG Hospitals, NBK111 Movie
![]() |
![]() |