![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి రూపొందించిన మూవీ 'విశ్వనాథ్ & సన్స్'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ రొమాంటిక్ ఫామిలీ డ్రామా.. రేపు (ఆగష్టు 14) థియేటర్లలో అడుగుపెట్టనుంది.
'విశ్వనాథ్ & సన్స్'పై నాగవంశీ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇటీవల తన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ల వాట్సాప్ గ్రూప్‌లో నాగవంశీ పెట్టిన మెసేజ్ అంటూ.. ఒక మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ మెసేజ్‌లో ఏముంది అంటే.. "ఆగష్టు 14న వెంకీ అట్లూరి స్టయిల్ బ్లాక్ బస్టర్ రాబోతుంది. నా టైం, మీ టైం బాగుంటే.. ఈ సినిమా అద్భుతాలు చేయవచ్చు. సినిమా అయితే నాకు చాలా చాలా నచ్చింది" అని నాగవంశీ మెసేజ్ చేసినట్టుగా ఉంది.
'సార్', 'లక్కీ భాస్కర్' లాంటి సినిమాలతో కట్టిపడేసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి మార్క్ మేజిక్ మళ్లీ రిపీట్ కాబోతోందని నాగవంశీ మాటలను భట్టి అర్థమవుతోంది.
మరి థియేటర్లలోకి వస్తున్న 'విశ్వనాథ్ & సన్స్' మూవీ నాగవంశీ నమ్మకాన్ని నిజం చేస్తుందేమో చూడాలి.
Vishwanath and Sons, Naga Vamsi, Venky Atluri, Suriya, Mamitha Baiju
![]() |
![]() |