Home  »  News  »  Chiranjeevi: SPకి అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

Updated : Apr 20, 2026

 

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)తాలూకు యొక్క మానియాని మరో రేంజ్ కి తీసుకెళ్లిన చిత్రం గ్యాంగ్ లీడర్(Gang Leader). ఒక రేంజ్ లోకి తీసుకెళ్లడమే కాదు చిరంజీవి నామజపాన్ని ప్రతి రోజు తలపించేలా చేసింది. అంతలా గ్యాంగ్ లీడర్ లో రాజారామ్ గా విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అసలు ఆ రోజుల్లో సమెక్య ఆంధ్రప్రదేశ్ లో ఏ వీధికి వెళ్లినా గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి ప్రదర్శించిన మేనరిజమ్స్, డైలాగ్స్, డ్రెస్సింగ్ స్టైల్ ని ఫాలో అయ్యే వాళ్లే కనిపించేవాళ్ళు. ముఖ్యంగా చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ఫాడించేస్తా అనే డైలాగ్ అయితే ఫేమస్. మరి మనం కూడా మూవీ నుంచి ఒక రఫ్ఫాడించే సన్నివేశాన్ని చూద్దాం 


రాజా రామ్(చిరంజీవి) తన ఫ్రెండ్స్ తో నైట్ పదకొండు దాటిన తర్వాత ఒక ఫంక్షన్ కి వెళ్లి   వస్తుంటాడు. క్రిమినల్ స్వభావం కలిగిన ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాజారామ్ స్నేహితులని పిలిచి ఉట్టి పుణ్యానికే రాజా రామ్ స్నేహితుడ్ని కొట్టడమే కాకుండా కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది మీరే చేసారని అంటాడు. దాంతో రాజా రామ్  ఎంతో దైర్యంగా సబ్ ఇన్స్పెక్టర్ తో అసలైనే నేరస్తుల్ని వదిలి  మా జోలికి వస్తావేంటని అంటాడు. పోలీసులని తుక్కు తుక్కుగా కొడతాడు. నిజానికి ఈ సన్నివేశం నుంచే గ్యాంగ్ లీడర్ మూవీ వేగంగా పరుగెత్తుతుంది. ఆ తర్వాత కన్యాకుమారిగా విజయశాంతి ఎంటర్ కావడం, కన్యా కుమారి అద్దెకి ఉంటుంటే ఇంటిని రాజా రామ్ ఖాళీ చేయించడం ఆ సందర్భంగా వచ్చే సీన్స్ అయితే సూపర్. ఆ వెంటనే మూవీకి ఆయువుపట్టైన ఎస్ పి తో రాజా రామ్ సీన్స్, జర్నలిస్ట్ ని పోలీస్ స్టేషన్ లోనే విలన్స్ అయిన ఏకాంబరం(రావు గోపాలరావు). కనకాంబరం(ఆనంద్ రాజ్) చంపడంతో కథనం మరింత రసవత్తరంలో పడుతుంది   


సదరు సన్నివేశాల్లో  రఘుపతిగా చిరంజీవి పలికించిన హావభావాలు అద్భుతం. న్యాయం కోసం, బాధ్యత కోసం ఆయన పోరాడే క్రమంలో చెప్పే డైలాగులు అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తాయి. చిరంజీవి గారి డైలాగ్ డెలివరీలో ఉన్న బేస్, ఆయన కళ్ళల్లో కనిపించే తీక్షణత ఆ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం ఒక హీరోగా మాత్రమే కాకుండా, ఒక నాయకుడిగా సమాజానికి ఇచ్చే సందేశం ఆనాటికీ, ఈనాటికీ స్ఫూర్తిదాయకం.

సాధారణంగా మాస్ సినిమాల్లో కేవలం యాక్షన్ మాత్రమే ఆశిస్తారు, కానీ 'గ్యాంగ్ లీడర్'లో మానవీయ విలువల గురించి, ధైర్యం గురించి చర్చించిన తీరు ప్రశంసనీయం. న్యాయం కోసం నిలబడటం, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం వంటి అంశాలను చిరంజీవి తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కరించారు. అందుకే ఈ సన్నివేశం దశాబ్దాలు గడిచినా ఒక మరుపురాని అనుభూతిని మిగిలిస్తూనే ఉంది.మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్‌లో ఇదొక మాస్టర్ పీస్.

also read: Tollywood: టాలీవుడ్ టు డే టాప్ ట్రెండింగ్స్

నేటి తరం సినిమాల్లో గ్రాఫిక్స్ తో కూడిన భారీ యాక్షన్ సీన్లు వస్తున్నప్పటికీ, 'గ్యాంగ్ లీడర్' వంటి సినిమాల్లోని సహజమైన నటన, పవర్‌ఫుల్ డైలాగులు ఇచ్చే కిక్కే వేరు. 50 కి పైగా సెంటర్స్ లో వంద రోజులు జరుపుకున్న గ్యాంగ్ లీడర్ హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో 162 రోజులు ప్రదర్శించడం అప్పట్లో రికార్డు.  ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు ప్రీవియస్ మూవీ జగదేక వీరుడు అతిలోకసుందరి రికార్డుని సైతం దారింది. చిరంజీవి అన్నయ్యలుగా మురళి మోహన్, శరత్ కుమార్ చెయ్యగా నిర్మలమ్మ, సుధ, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య కీలక రోల్స్. శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్ పై మాగంటి రవీంద్రనాధ్ చౌదరి నిర్మించగా విజయబాపినీడు(VIjaybapinudu)దర్శకత్వం వహించాడు.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.