వైజయంతి మూవీస్ బ్యానర్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)జూన్ 27 న కల్కి 2898 ఏడి(kalki 2898 ad)తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే.పురాణాలకి సైన్స్ ఫిక్షన్ ని జోడించి తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,దీపికా పదుకునే,రాజేంద్ర ప్రసాద్ వంటి అగ్ర నటులు ప్రధాన పాత్రలు పోషించగా నాగ్ అశ్విన్(nag ashwin)దర్శకత్వాన్ని వహించాడు.ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పన్నెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ ని సాధించడంతో పాటుగా డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు కూడా తెచ్చిపెట్టింది.
ఇక యుఎస్ లో కల్కి ని ప్రత్యంగిరా సినిమాస్ యాభై కోట్ల రిఫండబుల్ అడ్వాన్స్ కింద డిస్ట్రిబ్యూట్ చెయ్యడం జరిగింది.అంటే సినిమా ఫలితంలో ఏమైనా తేడా వస్తే నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ యాభై కోట్లని తిరిగి ప్రత్యంగిరా సినిమాస్ కి చెల్లించాలి.ఒక వేళ సినిమా యాభై కోట్ల కంటే ఎక్కువ సాధిస్తే వైజయంతి, ప్రత్యంగిరాలు ఒప్పందం చేసుకున్నదాని ప్రకారం ఇద్దరు పంచుకోవాలి. ఈ కండిషన్ తో ప్రత్యంగిరా సంస్థ యుఎస్ లో ప్రముఖ మల్టిప్లెక్స్ సంస్థలైన రీగర్,ఏఎంసి ద్వారా రిలీజ్ చెయ్యడం జరిగింది.
ఆ తర్వాత కల్కి ఘన విజయాన్ని అందుకోవడంతో పాటుగా తొంబై కోట్ల షేర్ ని కూడా రాబట్టిందనే వార్తలు వస్తున్నాయి.దీంతో ఇప్పుడు వైజయంతి మూవీస్(vyjayanthi movies)ఆ తొంబై కోట్లలో మాకు అరవై శాతం రావాలని, కలెక్షన్ల వివరాలు కూడా చెప్పాలని యుఎస్ నిబంధనల ప్రకారం రిగర్, ఏఎంసి మల్టిపెక్స్ సంస్థలకి కోర్టు నోటిసులని పంపించడం జరిగింది.