సెప్టెంబర్ 27 న రిలీజైన ఎన్టీఆర్(ntr)వన్ మాన్ షో దేవర(devara)పార్ట్ వన్ సృష్టించిన ప్రభంజనం అందరకి తెలిసిందే.డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకి పాన్ ఇండియా ప్రేక్షకులు మొత్తం ఫిదా అయిపోయారు.దీంతో ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టింది.అంతే కాకుండా చాలా రోజుల తర్వాత యాబై రోజులపాటు థియేటర్ లో రన్ అయిన సినిమాగా కూడా రికార్డు సృష్టించింది.
ఇక దేవర నవంబర్ ఎనిమిది నుంచి పాన్ ఇండియా వ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చిన విషయం తెలిసిందే.ఇప్పుడు క్రేజీ ట్విస్ట్ ఏమిటంటే బుధవారం అర్ధరాత్రి నుంచి ఇంగ్లీష్, కొరియన్, బ్రెజిలియన్, స్పానిష్ వంటి విదేశీ భాషల్లోకి కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో భారతీయ సినిమా ఏది కూడా ఆ లాంగ్వేజస్ లో రిలీజ్ కాలేదు.అలాంటిది దేవర స్ట్రీమింగ్ కి వచ్చేసి మరో అరుదైన రికార్డు ని సాధించిందని చెప్పవచ్చు.
ఇక నవంబర్ 8 న స్ట్రీమింగ్ కి వచ్చినప్పుడు హిందీ వెర్షన్ రిలీజ్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి హిందీ వెర్షన్ కూడా అందుబాటులో కి వచ్చింది. సడన్ గా ప్రపంచ భాషల్లో దేవర స్ట్రీమింగ్ కావడంపట్ల అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ,మంచి విజయాన్నిఅందుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ భారీ వ్యయంతో నిర్మించిన దేవర పార్ట్ 1 కి కొరటాల శివ(koratala siva)దర్శకుడు కాగా జాన్వీ కపూర్(janhvi kapoor)హీరోయిన్ గా చేసింది.