![]() |
![]() |

అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న హీరో 'సుశాంత్ సింగ్ రాజ్ పుత్'. ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియాన్ 2020 జూన్ 8న ముంబైలోని ఒక బహుళ అంతస్తుల భవనం 14వ అంతస్తు నుంచి కిందపడి దిశా సాలియాన్ మరణించింది. అయితే, ఆ ఘటన తర్వాత కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే, జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా అనుమానాస్పద రీతిలో మరణించడంతో ఈ రెండింటి మధ్య ఉన్న లింకుపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ నడిచింది.
ముంబై పోలీసులు మాత్రం తక్కువ రోజుల మధ్య జరిగిన ఈ విషాదాన్ని కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణం కేసు నమోదు చేసి, ఆపై ఆత్మహత్య కోణంలో దర్యాప్తు నిర్వహించారు. అయితే, దిశా సాలియాన్ తండ్రి సతీష్ సాలియాన్ తన కుమార్తె మృతిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ, తన కూతురిపై గ్యాంగ్ రేప్ జరిగి హత్య చేయబడిందని ఆరోపిస్తూ సరైన దర్యాప్తు చేపట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టుని ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ముంబై పోలీసుల దర్యాప్తు శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టు మాట్లాడుతు అసలు ఒక తీవ్రమైన నేరం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు సాధారణ ఎఫ్‌ఐఆర్ (FIR) ఎందుకు నమోదు చేయలేదు. దీంతో పోలీసులు సీఆర్పీసీ 174వ సెక్షన్ కింద 6 ఏళ్లుగా జరిపిన విచారణ అంతా ఎలాంటి చట్టబద్ధత లేనిదిగా మారిపోయింది. ఇది తీవ్రమైన సమయం వృథా. సాధారణంగా అనుమానాస్పద మరణాల విషయంలో 24 గంటల వ్యవధిలోనే పోస్టుమార్టం పూర్తి చేయాల్సి ఉండగా, దిశా సాలియాన్ విషయంలో 3 రోజుల సమయం ఎందుకు పట్టిందో సరిగ్గా చెప్పలేకపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉండగా, కేవలం ఒక్కరే చేయడంపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి
Also Read: మకుటం ఓటిటి రిలీజ్ డేట్ ఇదేనా!
14వ అంతస్తు పైనుంచి కిందపడిన వ్యక్తి శరీరంపై తీవ్ర గాయాలు ఉండాలి, కానీ ప్రారంభ చిత్రాలలో ఎలాంటి బాహ్య గాయాలు స్పష్టంగా లేకపోవడం, మరియు బిల్డింగ్ కి నేరుగా కింద పడకుండా దాదాపు 10 అడుగుల దూరంలో మృతదేహం పడి ఉండటం సైంటిఫిక్ దర్యాప్తుని ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా, మరణించిన రోజున అపార్ట్ మెంట్ లాక్ చేసి ఉన్న తలుపుల గురించిన సాక్షుల ప్రకటనలు, ఘటన జరిగిన ప్రదేశానికి సంబంధించిన పకడ్బందీ సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడం తీవ్ర లోపాలుగా మారాయి. పోలీసులు చేపట్టిన ప్రాథమిక ADR రిపోర్టు ఆధారాలను బాధితురాలి తల్లిదండ్రులకు 5 ఏళ్ల వరకు ఎందుకు ఇవ్వలేదు. ఒక తండ్రికి తన కూతురు మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకునే సంపూర్ణ హక్కు ఉంది. ఈ కేసులో చట్టబద్ధమైన క్లోజర్ ప్రక్రియ జరగాలని సంచలన తీర్పు ఇచ్చింది.

Sushant Singh Rajput, Disha Salian, Bombay High Court, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News, Bollywood
![]() |
![]() |