Home  »  News  »  ఒకే మూవీకి అనిరుధ్, థమన్ మ్యూజిక్.. ఏ అగ్ర హీరో మూవీకో తెలుసా!

Updated : May 26, 2026

 


భారతీయ సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనానికి తెర లేచింది. తమ ట్యూన్స్ తో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించే రాక్‌స్టార్స్ అనిరుధ్ రవిచందర్, థమన్ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం సౌత్  అభిమానుల్లో టాక్ హాఫ్ ది డే గా మారింది.  

థమన్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి ఎక్స్ వేదికగా 'నన్బా ఇక మొదలెడదామా’ అంటూ అనిరుద్ కి టాగ్  చేసాడు. ఇప్పుడు ఈ పోస్ట్ నిమిషాల్లో వైరల్ గా మారడంతో ఏ మూవీకి ఇద్దరు కలిసి పని చేయబోతున్నారనే చర్చలు ఇరువురి ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. కానీ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం అనిరుద్ తో థమన్ తన అప్ కమింగ్ మూవీలో ఒక  పాటని మాత్రమే పాడించుకుంటున్నట్టుగా టాక్. అనిరుద్ సింగర్ గాను తన సత్తా చాటుతూ వస్తున్న విషయం తెలిసిందే.

Also read: sri Gouri Priya: లెజండ్రీస్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న  శ్రీ గౌరిప్రియ.. అచ్చ తెలుగు యంగ్ హీరోయిన్

మరి ఇప్పుడు థమన్ ఏ మూవీలో అనిరుద్ చేత సాంగ్ పాడించుకుంటాడో చూడాలి. థమన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం, మెగా 158 కి థమన్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడనే టాక్ వినపడుతుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.