Home  »  News  »  sri Gouri Priya: లెజండ్రీస్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న  శ్రీ గౌరిప్రియ.. అచ్చ తెలుగు యంగ్ హీరోయిన్

Updated : May 26, 2026

 


 శ్రీ గౌరి ప్రియ(sri Gouri Priya).. మ్యాడ్, రైటర్ పద్మభూషణ్, లవర్ వంటి చిత్రాలతో హీరోయిన్ గా అశేష అభిమానులని, ప్రేక్షకులని మెప్పించింది. తమిళ్ లోను సత్తా చాటుతున్న ఈ అచ్చ తెలుగు భామ కిరణ్ అబ్బవరంతో కలిసి చెన్నై లవ్ స్టోరీ అనే చిత్రంతో త్వరలోనే థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ 'వదలనే..' అనే బ్యూటిఫుల్ లిరికల్ పాటని హైదరాబాద్‌లో జరిగిన ఒక భారీ గ్రాండ్ ఈవెంట్‌లో ఆస్కార్ విజేత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా లాంఛ్ చేశారు.

 ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురై, స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఆమె ఎమోషనల్ కావడం అక్కడున్న వారందరినీ కదిలించింది. గౌరి ప్రియ మాట్లాడుతూ.. 'నేను చిన్నప్పుడు ఏ సింగింగ్ కాంపిటీషన్‌కు వెళ్లినా మణిశర్మ గారి పాటలే పాడేదాన్ని. అలాంటి లెజెండ్ సంగీతం అందిస్తున్న సినిమాలో నేను హీరోయిన్‌గా నటించడం నా అదృష్టం. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లతో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది' అని చెబుతూనే, ఈ స్థాయికి చేరుకోవడంలో తన తల్లి పడ్డ కష్టాలను, ఆమే ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుని స్టేజ్ పైనే కన్నీరు మున్నీరయ్యారు. ఆమెను చూసి వేదికపై ఉన్న వారు, ఆడిటోరియంలోని ప్రేక్షకులు కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. 


Also read: Divyenndu sharma: పెద్ది చేసింది ఆయన కోసమే.. తెలుగోళ్ళకి భలే మర్యాద ఇచ్చావు  


అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ 'చెన్నై లవ్ స్టోరీ'. . సాయి రాజేశ్ కథని  అందిస్తుండగా, రవి నంబూరి ఈ చిత్రానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ మ్యూజికల్ ఫెస్టివల్ ఈవెంట్‌లో టాలీవుడ్‌కి చెందిన టాప్ 12 మంది ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు అతిథులుగా హాజరై సందడి చేశారు.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.