నందమూరి బాలకృష్ణ(balakrishna)నటవారసుడు మోక్షజ్ఞ(mokshagna)తన ఫస్ట్ మూవీని 'హనుమాన్'(hanuman)ఫేమ్ ప్రశాంత్ వర్మ(prashanth varma) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.డిసెంబర్ 6 న ఓపెనింగ్ జరుపుకోవాల్సి ఉండగా చిత్ర యూనిట్ కొన్ని కారణాల వల్ల వాయిదా వెయ్యడం జరిగింది.ఒక దశలో సినిమా ఆగిపోయిందనే పుకార్లు కూడా వచ్చాయి.కానీ ఆ తర్వాత బాలకృష్ణ ఒక ఈవెంట్ లో మాట్లాడుతు,మోక్షజ్ఞకి కోల్డ్ లాంటిది రావడం వలన ఓపెనింగ్ ని వాయిదా వేశామనే క్లారిటీ ఇచ్చి పుకార్లుకి తెరదించాడు.దీంతో త్వరలోనే ఒక మంచి రోజు చూసుకుని మూవీ ప్రారంభం కాబోతుంది.
ఇక మోక్షజ్ఞ సెకండ్ మూవీకి కూడా డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడని,హిట్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఆ మూవీకి దర్శకుడనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి.లేటెస్ట్ గా లక్కీభాస్కర్ తో మంచి హిట్ ని అందుకున్న వెంకీ గతంలో తొలిప్రేమ,సార్, మిస్టర్ మజ్ను,రంగ్ దే వంటి విభిన్నచిత్రాలకి దర్శకత్వం వహించాడు.దీంతో సెకండ్ మూవీ పై కూడా నందమూరి అభిమానులు ఎంతో ఇంట్రెస్ట్ తో ఉన్నారు.కానీ ఇప్పుడు లేటెస్ట్ గా మోక్షజ్ఞ తన సెకండ్ మూవీని 'కల్కి 2898(kalki 2898 ad)'తో అగ్ర దర్శకుడుగా మారిన నాగ్ అశ్విన్(naga ashwin)దర్శకత్వంలో చేయబోతున్నాడనే రూమర్స్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.పైగా ఈ మూవీని వైజయంతి మూవీస్ పై అశ్వనీదత్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నిర్మించబోతున్నాడని కూడా అంటున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూసిన నందమూరి అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవనే చెప్పాలి.వైజయంతీ బ్యానర్ లో నాగ్ అశ్విన్, మోక్షజ్ఞ సినిమా వస్తే ఇక ఆ సినిమా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్తున్నారు.మహేష్ బాబు(mahesh babu)రామ్ చరణ్(ram charan)లు వైజయంతి ద్వారానే హీరోలుగా పరిచయమయ్యి నేడు అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఈ రూమర్ నిజమవ్వాలని కోరుకుంటున్నారు.బాలకృష్ణ కూడా గతంలో వైజయంతి బ్యానర్ లో 'అశ్వమేధం' వంటి భారీ బడ్జెట్ సినిమాలో చేసిన విషయం తెలిసిందే.