![]() |
![]() |
ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, సహజీవనాలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం. అయినప్పటికీ సెలబ్రిటీల ప్రేమ వ్యహారాల గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. తమ ప్రేమ కలాపాలతో ఎప్పుడూ ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా అలాంటి రూమర్స్‌ని ఎదుర్కొంటున్నారు. అయితే అందులో ఎంత నిజం ఉంది అనేది పక్కన పెడితే.. మీనాక్షి ప్రేమాయణం అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ప్రచారం జరుగుతున్న మీనాక్షి లవ్‌స్టోరీలో హీరో ఎవరు అంటే..
కరెంట్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన సుశాంత్.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. 2021లో వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో ఫర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మీనాక్షి చౌదరితో సుశాంత్ ఎఫైర్ నడుపుతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించడం ఆ రూమర్స్‌కి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మీనాక్షి మాస్క్‌తో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని నడుస్తుండగా, సుశాంత్ లగేజ్ ట్రాలీతో వెంబడి రావడం వీడియోలో రికార్డ్ అయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
గతంలో సుశాంత్, మీనాక్షిలపై వచ్చిన రూమర్స్‌పై మీనాక్షి స్పందించారు. సుశాంత్ తనకు ఫ్రెండ్ మాత్రమేనని మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మీనాక్షి గతంలోనే చెప్పింది. సెలబ్రిటీలు ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడం సర్వసాధారణం అనే విషయం తెలిసిందే. అందుకే మళ్లీ మళ్లీ వీరి రిలేషన్ గురించి గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మీనాక్షి చెప్పినట్టు సుశాంత్‌తో ఉన్నది నిజంగా ఫ్రెండ్‌షిప్పేనా.. లేక మరేదైనా వారి మధ్య ఉందా అనేది తెలియాల్సి ఉంది. తాజాగా చక్కర్లు కొడుతున్న ఎయిర్‌పోర్ట్ వీడియోపై సుశాంత్, మీనాక్షి స్పందిస్తే అందరికీ క్లారిటీ వస్తుంది.
![]() |
![]() |