![]() |
![]() |

ఇటీవల 'వార్-2' అనే హిందీ ఫిల్మ్ తో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనికి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో రుక్మిణి వసంత్, టోవినో థామస్, బిజు మీనన్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ కూడా చేరినట్లు తెలుస్తోంది. (NTR Neel)
'డ్రాగన్'లో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం మూవీ టీం అనిల్ కపూర్ ని సంప్రదించగా.. ఆ రోల్ చేయడానికి ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోతో పాటు పలు పాత్రలు ప్రభావం చూపుతుంటాయి. నిడివితో సంబంధం లేకుండా.. మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంటాయి. 'డ్రాగన్'లో అనిల్ కపూర్ రోల్ ని కూడా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు వినికిడి. (Anil Kapoor)
పెద్దగా తెలుగు సినిమాలు చేయనప్పటికీ.. అనిల్ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పట్లో 'వంశ వృక్షం' అనే తెలుగు చిత్రంలో నటించిన ఆయన.. ఆ తర్వాత ఎక్కువగా డబ్బింగ్ సినిమాలతోనే అలరించారు. ఇటీవల కాలంలో 'యానిమల్' ఫిల్మ్ లో తనదైన నటనతో మెప్పించారు. ఇప్పుడు 'డ్రాగన్'తో చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటించబోతున్నారు.
కాగా, ఎన్టీఆర్ గత చిత్రం 'వార్-2'లో కూడా అనిల్ కపూర్ నటించడం విశేషం. ఎన్టీఆర్ తో ఆయనకిది వరుసగా రెండో సినిమా.
![]() |
![]() |