మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పెద్దల అంగీకారంతో త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు మాట్లాడుతూ.. త్వరలో తన కుమారుడుకి పెళ్లి చేయబోతున్నామని, ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ అధికారికంగా ప్రకటిస్తాడని తెలిపారు. అయితే ఇప్పుడు ఆ తరుణం వచ్చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ వినిపిస్తోంది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థానికి, పెళ్ళికి ఇప్పటికే ముహూర్తాలు ఖరారయ్యాయని ప్రచారం జరుగుతోంది. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో జూన్ లో ఎంగేజ్మెంట్ జరగనుందని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది చివరిలో వీరి వివాహాం వైభవంగా జరిపించనున్నారని సమాచారం.
కాగా వరుణ్, లావణ్య కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాలలో నటించారు. ఆ సినిమాలతో దగ్గరైన వీరు ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారని ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. మెగా ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఈవెంట్స్ లో లావణ్య కనిపించడం ఆ వార్తలకు బలం చేకూర్చింది. అయితే ప్రేమ విషయాన్ని వరుణ్ గానీ, లావణ్య గానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఇప్పుడు సైలెంట్ గా పెళ్లికి రెడీ అయ్యారని వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.