![]() |
![]() |

`డిక్టేటర్` (2016)లో నటసింహం నందమూరి బాలకృష్ణకి జోడీగా కనువిందు చేసిన తెలుగమ్మాయి అంజలి.. త్వరలో బాలయ్యని ఢీ కొట్టనుందా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న బాలకృష్ణ.. ఆపై వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ డిఫరెంట్ మూవీ చేయనున్నారు. తండ్రి - కూతురు కథతో తెరకెక్కనున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణకి జంటగా ప్రియమణి నటించనుందని సమాచారం. అలాగే, కూతురి పాత్రలో `పెళ్ళి సంద-డి` భామ శ్రీలీల కనిపించనుంది. లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కథానాయిక అంజలి దర్శనమివ్వనుందట. `నరసింహా` (1999) చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి తరహాలో ఈ క్యారెక్టర్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, అంజలి ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న పేరు నిర్ణయించని పాన్ - ఇండియా ప్రాజెక్ట్ లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.
![]() |
![]() |